హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడిన వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగా.. భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ (74), స్టోయినిస్ (64) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. భారత్ తరఫున వాషింగ్టన్ సుందర్ చెలరేగాడు. సుందర్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేసి అజేయంగా నిలువగా.. జితేశ్ శర్మ (13 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) సుందర్‌కు సహకరించాడు.
భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ 25, శుభ్‌మన్ గిల్ 15, సూర్యకుమార్ యాదవ్ 24, తిలక్ వర్మ 29, అక్షర్ పటేల్ 17 పరుగులు చేశారు.
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, వరున్ చక్రవర్తి 2, శివమ్ దూబే ఓ వికెట్ పడగొట్టగా... ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ 3, బార్ట్‌లెట్, స్టోయినిస్ తలో వికెట్ తీశారు. నాలుగో టీ20 గోల్డ్ కోస్ట్ వేదికగా నవంబర్ 6న జరుగుతుంది.
ఐదో వికెట్ కోల్పోయిన భారత్
14.2వ ఓవర్- 145 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. బార్ట్‌లెట్ బౌలింగ్‌లో తిలక్ వర్మ (29) ఔటయ్యాడు.15 ఓవర్ద తర్వాత భారత్ స్కోర్ 152/5గా ఉంది. సుందర్ (30), జితేశ్ శర్మ (5) క్రీజ్‌లో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
11.1 ఓవర్- 111 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఇల్లిస్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (17) ఔటయ్యాడు. 11.4 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 117/4గా ఉంది. వాషింగ్టన్ సుందర్ (6), తిలక్ వర్మ (24) క్రీజ్‌లో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన భారత్
7.3వ ఓవర్- 76 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. స్టోయినిస్ బౌలింగ్‌లో ఇల్లిస్‌కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (24) ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 82/3గా ఉంది. అక్షర్ పటేల్ (3), తిలక్ వర్మ (12) క్రీజ్‌లో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన భారత్
5.3వ ఓవర్- 61 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. నాథన్ ఇల్లిస్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (15) ఔటయ్యాడు.6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 64/2గా ఉంది. తిలక్ వర్మ (2), సూర్యకుమార్ యాదవ్ (19) క్రీజ్‌లో ఉన్నారు.
టీమిండియా రెండో వికెట్ డౌన్..
శుభ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 15 పరుగులు మాత్రమే చేసిన శుభ్‌మన్ గిల్.. నాథన్ ఎల్లీస్ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 63/2గా ఉంది. తిలక్ వర్మ (2), సూర్యకుమార్ యాదవ్ (19) క్రీజ్‌లో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన భారత్
3.3 ఓవర్- 187 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా ఆడుతున్న అభిషేక్ శర్మ 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 25 పరుగులు చేసి నాథన్ ఇల్లిస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 41/1గా ఉంది. శుభ్‌మన్ గిల్ (7), సూర్యకుమార్ యాదవ్ (7) క్రీజ్‌లో ఉన్నారు.
దూకుడుగా ఆడుతున్న అభిషేక్
187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(24), శుభ్‌మన్ గిల్(5) ఉన్నారు.
భారత్ ముందు భారీ టార్గెట్
హోబర్ట్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్(38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74), మార్కస్ స్టోయినిష్(39 బంతుల్లో 8 ఫోర్లు,2 సిక్స్‌లతో 64) విధ్వసంకర హాఫ్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు, శివమ్ దూబే ఒక్క వికెట్ సాధించారు.
ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్
12.6వ ఓవర్- 118 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న టిమ్ డేవిడ్ (74) శివమ్ దూబే బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 143/5గా ఉంది.
వరుణ్ మ్యాజిక్.. వరుస బంతుల్లో వికెట్లు
వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో వరుస బంతుల్లో మిచెల్ మార్ష్ (11), మిచెల్ ఓవెన్‌ను (0) ఔట్ చేశాడు. 9 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 75/4గా ఉంది. స్టోయినిస్ (1), టిమ్ డేవిడ్ (55) క్రీజ్‌లో ఉన్నారు. ఓ పక్క వికెట్లు పడుతున్నా డేవిడ్ మెరుపు హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ 23 బంతుల్లోనే ఈ మార్కును తాకాడు.
రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. 5 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..?
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. అర్షదీప్ సింగ్ తొలి ఓవర్‌లో, మూడో ఓవర్‌లో వికెట్లు తీశాడు.
తొలుత ట్రవిస్ హెడ్ (6), ఆతర్వాత జోస్ ఇంగ్లిస్‌ను (1) పెవిలియన్‌కు పంపాడు. 5 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 35/2గా ఉంది. టిమ్ డేవిడ్ (20), మిచ్ మార్ష్ (7) క్రీజ్‌లో ఉన్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
హోబర్ట్ వేదికగా ఇవాళ (నవంబర్ 2) భారత్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. జితేశ్ శర్మ, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఓ మార్పుతో బరిలోకి దిగింది. హాజిల్‌వుడ్ స్థానంలో సీన్ అబాట్ తుది జట్టులోకి వచ్చాడు.
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్
భారత్: శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా
చదవండి: IND vs SA: వారెవ్వా అన్షుల్!.. ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్


