భారత్, ఆసీస్‌ల మధ్య నాలుగో టి20 నేడు
ఆధిక్యమే లక్ష్యంగా ఇరుజట్లు బరిలోకి
గెలిచిన ఉత్సాహంతో టీమిండియా
పట్టుబిగించేందుకు సిద్ధమైన మార్ష్ బృందం
మధ్యాహ్నం 1.45 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
గోల్డ్‌కోస్ట్: సిరీస్‌లో కీలకమైన పైచేయి కోసం భారత్, ఆ్రస్టేలియా జట్లు సమరానికి సై అంటున్నాయి. తొలి మ్యాచ్ వర్షంతో రద్దవడం... తదుపరి రెండు మ్యాచ్‌ల్లో చెరోటి గెలవడంతో ఇరు జట్లు ప్రస్తుతం 1–1తో సమవుజ్జీగా నిలిచాయి. ఈ నేపథ్యంలో గురువారం ఇక్కడ జరిగే నాలుగో టి20లో గెలిచిన జట్టు ఇక సిరీస్‌లో ఓడిపోదు.
2–1తో ఆధిక్యంలోకి వెళ్లిన జట్టు ఆఖరిపోరులో ఓడినా సిరీస్ సమమవుతుందే కానీ చేజారనే చేజారదు. దీంతో భారత్, ఆ్రస్టేలియా జట్లు ఇక్కడే గెలిసి సిరీస్ పట్టు పట్టాలనే లక్ష్యంతో ఉన్నాయి. ఇదే జరిగితే మాత్రం టి20లో మెరుపుల హోరు ఖాయం! ఎందుకంటే పిచ్ కూడా బ్యాటింగ్‌కు స్వర్గధామం. అంతర్జాతీయ మ్యాచ్‌లు అరకొరగా జరిగినా... బిగ్‌బాష్ లీగ్‌లలో భారీస్కోర్లకు లోటే లేదు. దీంతో బౌలర్లకే కఠిన సవాళ్లు ఎదురవక తప్పదు.
గిల్ బాకీ పడ్డాడు
ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఈ టి20 సిరీస్‌లోనే కాదు... అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌లోనూ పెద్దగా ప్రభావమే చూపలేదు. పరుగుల పరంగా రెండు సిరీస్‌లకు బాకీ పడ్డాడు. బహుశా బ్యాటింగ్‌కు అచ్చొచ్చే ఈ మ్యాచ్‌లో ఆ బాకీ ఏదో తీర్చుకుంటే భారత్‌కు శుభారంభం లభిస్తుంది. టి20 స్పెషలిస్టు ఓపెనర్, ధనాధన్ హిట్టర్ అభిషేక్ వర్మ పవర్ ప్లేలో కావల్సినదానికంటే పెద్ద సంఖ్యలోనే పరుగులు కూడబెడతాడు.
కెపె్టన్ సూర్యకుమార్, తిలక్ వర్మలు సైతం భారీ షాట్లకు తెగబడితే, బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఆక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లు అడపాదడపా దంచేస్తే మాత్రం 200 పైచిలుకు స్కోరు టీమిండియాకు ఏమంత కష్టమే కాదు. అప్పుడు బుమ్రా, అర్‡్షదీప్, వరుణ్, అక్షర్, సుందర్‌లతో కూడిన బౌలింగ్ దళం తమ పనిని చింత లేకుండా చక్కబెట్టే అవకాశం ఉంటుంది.
కీలక ఆటగాళ్లు దూరం
రెండో టి20తోనే హాజల్‌వుడ్, మూడో మ్యాచ్‌తో హెడ్, అబాట్‌లు జట్టు వీడారు. త్వరలోనే జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ కోసం తుదిసన్నాహాల్లో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడేందుకు కీలకమైన ఆటగాళ్లను విడుదల చేశారు. అయితే ఇది ఆసీస్ లాంటి అగ్రశ్రేణి జట్టుకు ప్రతికూలత కాదు... భారత్‌కు గొప్ప అనుకూలతగా భావించరాదు. ఎందుకంటే ఇది కంగారూ జట్టు. మేటి ఆటగాళ్లెంతో మంది ఉన్నారు.
తొలి మూడు మ్యాచ్‌లు ఆడని విధ్వంసకర ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ ఈ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. స్టొయినిస్, టిమ్ డేవిడ్, ఇన్‌గ్లిస్‌లాంటి హిట్టర్లూ ఉన్నారు. కాబటి ఒకరిద్దరు లేనంత మాత్రం ఆసీస్ బలహీనమనుకుంటే తప్పులో కాలేసినట్లే కెప్టెన్ మిచెల్ మార్‡్ష, టిమ్ డేవిడ్, స్టొయినిస్‌లు ఈ సిరీస్‌లో చక్కని ఫామ్‌లో ఉన్నారు.
అనుభవజు్ఞలైన పేస్ బలగం లేకపోవడం కాస్త ఇబ్బందికరమైనప్పటికీ బార్ట్‌లెట్, ఎలిస్‌లు ఆ బాధ్యతను సమర్థవంతగా నిర్వర్తించగలరు. ఈ నేపథ్యంలో సొంత ప్రేక్షకుల మద్దతుతో ఆతిథ్య జట్టు దంచేయడం ఖాయం! తద్వారా ఇరుజట్ల బ్యాటింగ్ మెరుపులతో స్కోరు హోరెత్తడం కూడా ఖాయమే!
పిచ్–వాతావరణం
ఈ కరార వేదిక బిగ్‌బాష్ లీగ్‌కు ఫేమస్. మెరుపుల టి20లో భారీస్కోర్లకు చిరునామా దీంతో బ్యాటర్లకు పండగే. ఇక అంతర్జాతీయ మ్యాచ్‌ల విషయానికొస్తే ఇక్కడ కేవలం రెండే మ్యాచ్‌లు జరిగాయి. వర్ష సూచన లేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, శుబ్‌మన్, తిలక్‌వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేశ్, శివమ్ దూబే, అర్‡్షదీప్, వరుణ్, బుమ్రా.
ఆస్ట్రేలియా: మార్ష్(కెప్టెన్ ), షార్ట్, ఇన్‌గ్లిస్, టిమ్ డేవిడ్, మిచ్ ఒవెన్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, బార్ట్‌లెట్, డ్వార్షుయిస్, ఎలిస్, కునెమన్.


