టీమిండియాతో తొలి టీ20కి ముందు (India vs Australia) ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు జరిగింది. వారి స్టార్ స్పిన్నర్, టీ20 లీడింగ్ వికెట్ టేకర్ ఆడమ్ జంపా (Adam Zampa) వ్యక్తిగత కారణాల చేత (రెండోసారి తండ్రి కాబోతున్నాడు) తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. జంపా స్థానాన్ని మరో స్పిన్నర్ తన్వీర్ సంఘా (Tanveer Sangha) భర్తీ చేయనున్నాడు.
సంఘా రెండేళ్ల తర్వాత టీ20 ఆడనున్నాడు. అతని చివరి మ్యాచ్ భారత్‌తోనే ఆడాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి రింకూ సింగ్ వికెట్ తీశాడు. సంఘా ఆస్ట్రేలియా తరఫున 4 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. సంఘా జంపా స్థానంలో జట్టులోకి వచ్చినప్పటికీ.. ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉంటాడో లేదో చూడాలి. ఆసీస్‌కు ఇప్పటికే మాథ్యూ కుహ్నేమన్ రూపంలో మరో స్పిన్ బౌలింగ్ ఆప్షన్ ఉంది.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కాన్‌బెర్రా వేదికగా ఈ నెల 29న తొలి టీ20 జరుగనుంది. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా మూడు వేర్వేరు జట్లను ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్‌లకు ఓ జట్టు.. మూడో టీ20కి ఓ జట్టు.. చివరి రెండు మ్యాచ్‌లకు మరో జట్టును ప్రకటించారు.
తొలి రెండు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, ట్రవిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్, జోష్ ఫిలిప్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఇల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, మాథ్యూ కుహ్నేమన్, తన్వీర్ సంఘా (ఆడమ్ జంపా స్థానంలో తొలి టీ20కు మాత్రమే)
మూడో టీ20కి ఆస్ట్రేలియా జట్టు..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, ట్రవిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్లీ బియర్డ్‌మన్, జోష్ ఇంగ్లిస్, జోష్ ఫిలిప్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఇల్లిస్, మాథ్యూ కుహ్నేమన్, ఆడమ్ జంపా
చివరి రెండు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, ట్రవిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్లీ బియర్డ్‌మన్, జోష్ ఇంగ్లిస్, జోష్ ఫిలిప్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఇల్లిస్, మాథ్యూ కుహ్నేమన్, ఆడమ్ జంపా
భారత్ టీ20 జట్టు..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా
టీ20 సిరీస్ షెడ్యూల్..
తొలి టీ20- అక్టోబర్ 29 (కాన్‌బెర్రా)
రెండో టీ20- అక్టోబర్ 31 (మెల్‌బోర్న్)
మూడో టీ20- నవంబర్ 2 (హోబర్ట్)
నాలుగో టీ20- నవంబర్ 6 (గోల్డ్ కోస్ట్)
ఐదో టీ20- నవంబర్ 8 (బ్రిస్బేన్)
చదవండి: పృథ్వీ షా విధ్వంసకర శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ


