
ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా (Team India) ఓటమితో ప్రారంభించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో (India vs Australia) 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. వరుణుడి ఆటంకాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
వరుణుడి ఆటంకాలు.. 26 ఓవర్ల మ్యాచ్
పలు అంతరాయాల తర్వాత మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు. ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఆదుకున్న రాహుల్, అక్షర్.. నితీశ్ మెరుపులు
వికెట్‌కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్‌లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.
దారుణంగా విఫలమైన రోహిత్, కోహ్లి
నాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శుభ్‌మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. వాషింగ్టన్ సుందర్ 10, హర్షిత్ రాణా 1, అర్షదీప్ సింగ్ డకౌటయ్యారు.
సత్తా చాటిన ఆసీస్ బౌలర్లు
ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.
సునాయాసంగా ఛేదించిన ఆసీస్
26 ఓవర్లలో భారత్ 136 పరుగులు చేసినప్పటికీ.. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని అన్నే ఓవర్లలో 131 పరుగులకు కుదించారు. ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్), రెన్‌షా (21 నాటౌట్) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ (8), మాథ్యూ షార్ట్ (8) విఫలం కాగా.. జోష్ ఫిలిప్ (37) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అర్షదీప్, అక్షర్, సుందర్ తలో వికెట్ తీశారు.
ఈ సిరీస్‌లో రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్ వేదికగా జరుగనుంది. కాగా, భారత జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: Test Twenty: క్రికెట్‌లో సరికొత్త ఫార్మాట్.. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం