ఒక రాష్ట్రానికి కానీ, దేశానికి కాని వాటి సరిహద్దులో ఉన్న ప్రాంతాలు చాలా కీలకం ఎందుకంటే నైబర్ హుడ్ ప్రాంతాలతో ఉండే సంబంధాల వల్ల ఆ ప్రాంత శాంతిభద్రతలు ఆధారపడతాయి అంతేకాకుండా అభివృద్దికి సైతం పొరుగు ప్రాంతాలు ఎంతో కీలకం.అయితే ఏ దేశాలతో సరిహద్దులు లేకుండా ఒంటరిగా ఉన్న కంట్రీస్ మీకు తెలుసా. ఆ దేశాలు ఇతర దేశాలతో ఎటువంటి బార్డర్స్ లేకుండా స్వతంత్ర్యంగా ఉంటున్నాయి. మరి అవేంటే తెలుసుకోవాలనుందా అయితే ఈస్టోరీ చదవండి.
ఆస్ట్రేలియా
ఖండాలలో ఏడవదిగా పిలవబడే ఆస్ట్రేలియా ఒక ద్వీపం అని అందరికీ తెలుసు. అయితే ఆస్ట్రేలియాకు ఇతర ఏ దేశాలతో సరిహద్దులు లేవు.ఈ విధంగా ఉండడం వల్ల అక్కడ ప్రత్యేకమైన జీవవైవిధ్యత ఏర్పడింది.అంతే కాకుండా కంగారులాంటి అరుదైన జంతువులు ఈ ఖండంలోనే అధికంగా జీవిస్తాయి. ఆ దేశానికి సరాసరీ 150 కిలోమీటర్ల దూరాన పాపువా న్యూగియానా అనే దేశం ఉంది.
న్యూజిలాండ్
న్యూజిలాండ్ అనగానే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. ఇక్కడి జలపాతాలు, సరస్సులు చూపరులను కట్టిపడేస్తాయి. ఇక్కడి ప్రజలు సైతం మంచి స్నేహపూర్వకంగా ఉంటూ అత్యన్నత జీవనవిధానాన్ని కలిగి ఉంటారు. ఆస్ట్రేలియాకు సూమారు 2000 కిమీ దూరంలో ఈ దేశం ఉంటుంది. ప్రకృతిని అస్వాదించుకునే పర్యాటకులకు ఈ న్యూజిలాండ్ మంచి ఛాయిస్.
జపాన్
ఈ దేశం పేరు వింటే చాలు కష్టపడేతత్వం అధికంగా ఉన్న ప్రజలు గుర్తొస్తారు. సహజ సంపదలు అధికంగా లేకున్నా, అణుబాంబు బాధిత దేశమైనా, మానవశ్రమనే నమ్ముకొని సాంకేతికతతో దూసుకుపోతూ ప్రపంచంలోని అగ్రదేశాలకు పోటీ ఇస్తున్న దేశం. అయితే ఈ కంట్రీ సైతం ఏ ఇతర దేశాలతో సరిహద్దులు పంచుకోవడం లేదు.ఇక్కడి ప్రజల జీవన విధానం, సంస్కృతి సైతం ఇతర ప్రాంతాలతో పోలిస్తే ప్రత్యేకంగా విభిన్నంగా ఉంటుంది.
ఐస్ లాండ్
ఐస్ లాండ్ ఉత్తర యూరప్ లో ఉన్న ఈ కంట్రీలో అగ్నిపర్వతాలు, హిమనదులు అధికంగా ఉంటాయి. అంతే కాకుండా ఈ దేశంలో దోమలు ఉండేవి కావు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఐస్ లాండ్ లోనూ దోమలు వచ్చినట్లు ఇటీవల కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.


