ఇంగ్లీష్ మాట్లాడే ప్రపంచంలో తొలిసారిగా, స్థానిక బాక్సాఫీస్ వద్ద భారతీయ సినిమాలు ఆస్ట్రేలియన్ సినిమాల కలెక్షన్లను అధిగమించాయని ఒక కొత్త నివేదిక వెల్లడించింది. త్వరలో వచ్చే వారం జరగనున్న ఒక ప్రధాన సినిమా పరిశ్రమ సమావేశానికి ముందు ఈ నివేదికను విడుదల చేసిన చిత్ర పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ నిక్ హేస్, హిందీ, తెలుగు, తమిళం. ఇతర భారతీయ భాషలలోని చిత్రాలు అమెరికన్ బ్రిటిష్ చిత్రాల తర్వాత ఆస్ట్రేలియాలో మూడవ అతిపెద్ద మార్కెట్‌గా మారాయని చెప్పారు.
అవి 2021లో 32.5 మిలియన్ డాలర్లుగా ఉండగా, ఈ సంవత్సరం అంచనా వేసిన దాని కన్నా మిన్నగా 50 మిలియన్ డాలర్లకు పెరిగాయి. అదే కాలంలో, ఆస్ట్రేలియన్ చిత్రాలు ‘పేలవమైన‘ బాక్సాఫీస్ ప్రదర్శనతో 54.2 మిలియన్ డాలర్ల నుంచి ఈ సంవత్సరం 16.8 మిలియన్ డాలర్లకు పడిపోయాయని హేస్ ఆందోళన వ్యక్తం చేశారు.
‘ఆంగ్లోఫోన్ మాట్లాడని చలనచిత్ర రంగం జాతీయ పరిశ్రమ కంటే ముందుకెళ్లిన మొదటి ప్రధాన ఆంగ్ల భాషా మార్కెట్ ఆస్ట్రేలియా ఇది యుకె. యుఎస్ లేదా కెనడాలో కనిపించని నిర్మాణాత్మక మైలురాయి‘ అని ఆయన అంటున్నారు. అంటే ఆంగ్లేతర చిత్రాలు ఆస్ట్రేలియాలో ఈ స్థాయి విజయం సాధించడం మరే దేశంలోనూ లేని వైచిత్రి అని ఆయన భావం.
భారీ సంఖ్యలో ప్రేక్షకుల బలం, నమ్మకమైన చిత్రాల సరఫరా కమ్యూనిటీ ఆధారిత మార్కెటింగ్ భారతీయ విజయం వెనుక ఉన్నాయని డెండీ సినిమాస్, ఐకాన్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, అంబ్రెల్లా ఎంటర్‌టైన్‌మెంట్‌లలో సీనియర్ పాత్రలు పోషించిన హేస్ అభిప్రాయపడుతున్నారు.
గత ఐదు సంవత్సరాలలో అతిపెద్ద భారతీయ హిట్‌లుగా హిందీ సినిమా యానిమల్(Animal Movie) 5.2 మిలియన్ డాలర్లు వసూలు చేయగా మరో బాలీవుడ్ మూవీ పఠాన్(Pathaan) 4.7 మిలియన్లు రాబట్టింది. అదే బాటలో జవాన్(Jawan) కూడా 4.7 మిలియన్లతో 3వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత టాలీవుడ్ అక్కడ సత్తా చాటింది. తెలుగు సినిమా పుష్ప: ది రూల్ – పార్ట్ 2 4.5 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో ఆ తర్వాతి స్థానంలోనూ మరో తెలుగు సినిమా ఆర్‌ఆర్‌ఆర్ 3.6 మిలియన్లతో అంతర్జాతీయ స్థాయిలో దక్షిణ భారత సినిమా సత్తా చాటినట్టు న్యూమెరో బాక్స్ ఆఫీస్ డేటా వెల్లడిస్తోంది.
‘‘ఆడియన్స్ స్పీక్ – ఇట్స్ టైమ్ వుయ్ లిజెన్’’ అనే పేరుతో వెలువరించిన ఈ నివేదిక గోల్డ్ కోస్ట్‌లో ఆస్ట్రేలియన్ ఇంటర్నేషనల్ మూవీ కన్వెన్షన్‌కు ముందు బహుళ మార్గాల ద్వారా ప్రేక్షకులను పెంచుకోవడానికి సినిమాలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచిస్తోంది.
ఇదే పంథా కొనసాగితే...
మరోఐదు సంవత్సరాలు ఈ ట్రెండ్ కొనసాగితే, న్యూజిలాండ్ సినిమాలు, బహుశా చైనీస్. ఫ్రెంచ్ సినిమాలు కూడా ఆస్ట్రేలియన్ సినిమాలను అధిగమించవచ్చని హేస్ విశ్వసిస్తున్నారు. ‘ఆస్ట్రేలియన్లలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఇంట్లో ఇంగ్లీష్ కాకుండా వేరే భాష మాట్లాడుతుండగా, ప్రతి 10 సినిమా టిక్కెట్లలో ఒకటి కంటే తక్కువ ఇంగ్లీష్ కాని భాషా టైటిల్స్‌కు అమ్ముడవుతున్నాయి‘ అని నివేదిక చెబుతోంది. ‘శనివారం రాత్రి సిడ్నీ లేదా మెల్‌బోర్న్‌లోని ఏదైనా సినిమా థియేటర్‌లోకి నడిచి చూడండి, మీరు అరబిక్, తగలోగ్, హిందీ, వియత్నామీస్, మాండరిన్, గ్రీక్. లాబీలో తదితర డజను భాషలను వినవచ్చు కానీ లైట్లు మసకబారినప్పుడు, దాదాపు ప్రతి స్క్రీన్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది.
’’ఇంగ్లీష్ సినిమాలు ఇప్పటికీ అధికంగా ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, వాటి మార్కెట్ వాటా 2021లో దాదాపు 95 శాతం నుంచి ఈ సంవత్సరం 91 శాతానికి పడిపోయిందని నివేదిక పేర్కొంది. ‘జనాభా స్క్రీన్ వాటా మధ్య దాదాపు సమానత్వాన్ని సాధించిన ఏకైక విదేశీ భాషా రంగం భారతీయ భాష మాత్రమే‘ అని అది పేర్కొంది. ‘మాండరిన్, అరబిక్ వియత్నామీస్ జనాభా వారి జనాభాతో పోలిస్తే గణనీయమైన రీతిలో వారి స్క్రీన్ వాటా తక్కువగా కనిపిస్తోందని తేల్చింది.


