ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతికి అక్కడ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. లక్ష్మీపార్వతికి నాయకులు చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి ,గజ్జల చంద్ర ఓబుల రెడ్డి,వీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి ,దూడల కిరణ్ రెడ్డి, కామరాజు కృష్ణ చైతన్య ,కోటా శ్రీనివాసరెడ్డి, దుగ్గింపుడి కిరణ్ రెడ్డి, సిద్ధన సురేష్ రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు.
ప్రస్తుతం బ్రిస్బేన్‌లో ఉన్న లక్ష్మీపార్వతి.. వారం రోజుల పాటు ఆస్ట్రేలియాలోనే ఉంటారు. అక్కడ వివిధ నగరాల్లో జరిగే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాకు ఆమె హాజరుకానున్నారు.


