breaking news
Quadruplets born
-
ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి
ఆస్ట్రేలియాకు చెందిన 34 ఏళ్ల జెనిటార్ సా నా’అమోవానా ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈమె ఇటీవల నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. నలుగురూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. అప్పటికే నలుగురు చిన్న పిల్లలను పెంచుతున్న ఆ దంపతుల ఇల్లు ఈ నలుగురు పాపల రాకతో మొత్తం ఎనిమిది మంది సభ్యుల కుటుంబంగా మారింది. కానీ ఈ సంతోషకరమైన పరిణామం రాత్రికి రాత్రే వారికి సరికొత్త సవాళ్లను తెచ్చిపెట్టింది.నలుగురు ఆడపిల్లలు పుట్టడం తల్లిదండ్రులు తాము మర్చిపోలేని ఆశీర్వాదంగా అభివర్ణించారు. కానీ వారిని సంరక్షించేందుకు ఆర్థిక వనరులు అవసరమం. ముఖ్యంగా డైపర్లు, ఫార్ములా పాలు, బట్టలు లాంటి రోజువారీ ఖర్చులు ఊహించని భారమే. అయితే ఒకేసారి నలుగురు నవజాత శిశువులను పోషించేందుకు స్నేహితులు, అభిమానులు మొదట్లో చాలా సాయంగా నిలిచారు. మరికొంతమంది ఆ దంపతుల పట్ల ప్రశంసలు కురిపిస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఇంత పెద్ద కుటుంబాన్ని నిర్వహించే క్రమంలో సమాజం నుండి లభిస్తున్న ఈ మద్దతు వారికి ఎంతో విలువైందిగా మారింది.అయితే వీరికి ఇంకో సమస్య వచ్చి పడింది. వీళ్లందరితో ప్రయాణించేందుకు ప్రస్తుతం ఉన్న కారులో అందరూ సురక్షితంగా కూర్చోవడానికి సరిపడా సీట్లు లేవు. ఆసుపత్రి పర్యటనలు, స్కూల్ డ్రాప్‌లు, ఇతర ప్రయాణాలు సులభంగా సాగేందుకు 10 సీట్ల వ్యాన్ (10-seater van)అవసరం ఉంటుందని ఆ కుటుంబం భావిస్తోంది. అలాంటి వ్యాన్‌ను కొనుగోలు చేయడానికి ఆ తల్లి ఆన్లైన్లో విరాళాల సేకరణను (fundraising) ప్రారంభించడం విశేషంగా నిలిచింది. తమ ఏడుగురు పిల్లలందరికీ సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి సరైన వాహనం, వనరులు ఉన్నాయని నిర్ధారించుకోవడమే ఆ కుటుంబం తక్షణ లక్ష్యంగాపెట్టుకుంది.డాక్టర్ అలెక్సా బెండాల్ ఏమన్నారంటేమోనోజైగోటిక్ క్వాడ్రప్లెట్స్ (ఒకే ఫలదీకరణం చెందిన అండం నుండి ఏర్పడిన ఒకేలా ఉండే నలుగురు శిశువులు) ప్రపంచంలోనే అత్యంత అరుదైన గర్భధారణ రకాల్లో ఒకటి. నామోనా విషయంలో విశేషం ఏమిటంటే, ఆమెకు పుట్టిన ఈ నలుగురు శిశువులకు ఒకే మాయ (placenta) అని నామెనాకు వైద్యం చేసిన డాక్టర్, రాయల్ బ్రిస్బేన్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్‌కు చెందిన ఫీటల్ మెడిసిన్,ప్రసూతి వైద్యురాలు డాక్టర్ అలెక్సా బెండాల్ తెలిపారు. 1.5 కోట్ల కేసుల్లో ఒకరికి మాత్రమే జరుగుతుందని భావిస్తున్నామన్నారు. ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో ఒకటి రెండు కేసులు ఉండి ఉండవచ్చు కానీ ఆస్ట్రేలియాలో తమకు తెలిసినంత వరకు ఇదే ఏకైక కేసు అని చెప్పారు. View this post on Instagram A post shared by Brisbane Times (@brisbane_times) ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్. -
ఒకే కాన్సులో నలుగురికి జన్మ.. గంటల వ్యవధిలోనే శిశువులు మృతి
ఓ గర్భిణి ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఆమెకు ఇది సాధారణ కాన్పు కావడం విశేషం. శిశువుల్లో ముగ్గురు మగవాళ్లు, ఒకరు అమ్మాయి ఉన్నారు. అయితే దురదష్టవశాత్తు ఆ నలుగురు చిన్నారులు గంటల వ్యవధిలోనే ఆసుపత్రిలో మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుప్వారా జిల్లాలోని కేరాన్ గ్రామానికి చెందిన కలీదా బేగం గర్భిణి. ఆదివారం పురుటి నొప్పులు రావడంతో స్థానికంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు వెళ్లింది. పరీక్షించిన వైద్యులు.. కాన్పు ఇక్కడ చేయడం సాధ్యం కాదని, కుప్వారా జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని కలీదా కుటుంబ సభ్యులకు సూచించారు. ఇక సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కుప్వారా జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ ఆమె సాధారణ కాన్పు ద్వారా నార్మల్ డెలివరీ ద్వారా నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. నలుగురిలో ముగ్గురు అమ్మాయిలు కాగా, ఒకరు అబ్బాయి. శిశువులందరూ తక్కువ బరువుతో జన్మించారు. అయితే నలుగురు చిన్నారులు నెలలు నిండకుండా, తక్కువ బరువుతో పుట్టినట్లు వైద్యులు తెలిపారు. వారికి ప్రత్యేక సంరక్షణ అవసరమని, నియోనాటల్ ఇంటెన్వివ్ కేర్ యూనిట్లో తక్షణమే చేర్పించాలని పేర్కొన్నారు. కానీ కుప్వారా జిల్లా ఆసుపత్రిలో అందుబాటులో లేదు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు ఆడ శిశువులు కుప్వారా ఆస్పత్రిలోనే మరణించారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం తల్లీ, మగ శిశువును శ్రీనగర్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ బాబు కూడా చనిపోయాడు. ఇలా గంటల వ్యవధిలోనే నలుగురు శిశువులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కలీదాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కలీదా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా కుప్వారా జిల్లా ఆసుపత్రిలో ప్రసూతి, నవజాత శిశువుల అత్యవసర సంరక్షణ సౌకర్యాలు లేవు. దీంతో ఎక్కువగా రోగులను శ్రీనగర్‌కు పంపిస్తుంటారు. ఈ క్రమంలో సకాలంలో వైద్యం అందక చాలా దూరం ప్రయాణించడంతో రోగులు మరణించిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. -
ఒకే కాన్పులో నలుగురి జననం : ముగ్గురు క్షేమం
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఈరోజు ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చింది. వారిలో ఒక శిశువు మృతి చెందింది. ముగ్గురు శిశువులు క్షేమంగా ఉన్నారు. ఆస్పత్రి వద్ద అందరూ ఈ విషయమే చర్చించుకుంటున్నారు. పలువురు వచ్చి శిశువులను చూస్తున్నారు. **


