నా 5 కోట్ల కారుపై వివాదమెందుకు? | mulayam singh son prateek yadav statement on lamborghini car | Sakshi
Sakshi News home page

నా 5 కోట్ల కారుపై వివాదమెందుకు?

Feb 9 2017 3:20 PM | Updated on Jul 30 2018 8:10 PM

నా 5 కోట్ల కారుపై వివాదమెందుకు? - Sakshi

నా 5 కోట్ల కారుపై వివాదమెందుకు?

తన రూ. 5 కోట్ల లంబోర్గిని కారుపై సోషల్ మీడియాలో తలెత్తిన వివాదంపై ప్రతీక్ యాదవ్ తొలిసారి స్పందించారు.

సమాజ్వాద్ పార్టీలో ప్రస్తుతం తండ్రికొడుకులు బాగానే ఉన్నప్పటికీ, గత కొన్ని రోజుల క్రితం వరకు తండ్రి ములాయం, పెద్ద కొడుకు అఖిలేష్ మధ్య రాజుకున్న వివాదం అంతాఇంతా కాదు. సైకిల్ గుర్తు కోసం ఆ ఇద్దరి పోరు ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్లో కలవరం సృష్టించింది. అదే సమయంలో ములాయం చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ లంబోర్గిని కార్లో లక్నో రోడ్లపై చక్కర్లు కొట్టడం పేపర్లలో హెడ్లైన్స్గా నిలిచింది. ఇది కాస్తా ఇంటర్నెట్లో వైరల్ అయింది. తన రూ. 5 కోట్ల లంబోర్గిని కారుపై సోషల్ మీడియాలో తలెత్తిన వివాదంపై ప్రతీక్ యాదవ్ తొలిసారి స్పందించారు. ఆ లంబోర్గిని హురాకాన్ కారును రుణం తీసుకుని మరీ కొనుకున్నానని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి చెప్పారు. రాజకీయాలంటే పెద్దగా ఇష్టంలేని ప్రతీక్ యాదవ్ రియల్ ఎస్టేట్, జిమ్స్ వంటి బిజినెస్లను కలిగి ఉన్నారు.
 
ఈ కారుకు సంబంధించిన అన్ని పేపర్లు తన దగ్గరున్నాయని, ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నట్టు ప్రతీక్ తెలిపారు.  ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా దీనిపై ఎందుకంత రాద్ధాంతమని ప్రశ్నించారు. ఒకవేళ ఈ రూ.5 కోట్లను ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టుంటే ఎవరూ ఏమి అనేవారు కాదుకదా? అని ప్రశ్నించారు. సమాజ్ వాద్ పార్టీలో చిచ్చు రేగడానికి ఓ వంతు కారణమైన ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ యాదవ్ ఈ సారి ఎన్నికల్లో లక్నో నుంచి పోటీకి దిగబోతున్నారు. తన భార్య  అపర్ణ యాదవ్ కచ్చితంగా గెలుస్తారని ప్రతీక్ ధీమా వ్యక్తంచేశారు. తను పోటీకి దిగబోతున్న ప్రాంతంలో అపర్ణ చాలా చేశారని ప్రతీక్ తెలిపారు. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తులో 250 సీట్ల నుంచి 300 సీట్ల వరకు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. తనకు రాజకీయాలంటే ఇష్టంలేదని, ఒకవేళ ఆ ఇష్టమే ఉంటే ఎప్పుడో రాజకీయాల్లోకి ప్రవేశించే వాడినని చెప్పారు.  ఎక్కువగా తన బిజినెస్ల వైపే దృష్టిసారిస్తానని ప్రతీక్ పునరుద్ఘాటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement