ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఆటో యూనియన్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్ ఏరియాలో ఆటో యూనియన్ నాయకులు రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ నెలకు రూ.12 వేలు వెంటనే అమలు చేయాలని అన్నారు. ప్రతిపక్ష బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు ఇప్పటివరకు ఆటో కార్మికుల సమస్యలపై స్పందించడంలేదన్నారు. తక్షణమే ఆటో డ్రైవర్లపై ఆ పార్టీ స్టాండ్ ఏమిటో ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.సాయిలు, పజిల్‌బాయ్, శ్యంసుందర్, గొల్లరాజు, అంజనేయులు, కథలయ్య, గోపాల్, లక్ష్మణ్, వెంకటయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.


