పెద్ద డివిజన్ 23.. చిన్న డివిజన్ 22
● మొదటి ఫలితం 22లోనే..!
● చివరి ఫలితం 23 డివిజన్‌లో..
పాలమూరు: మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా వీటిలో అతి పెద్ద డివిజన్ 23వ డివిజన్ కాగా అతి చిన్న డివిజన్ 22వ డివిజన్ కావడం విశేషం. వైశాల్యం పరంగా ఈ డివిజన్ చాలా చిన్నగా ఉండటం వల్ల ఇప్పటికే అన్ని పా ర్టీల నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
● ఫిబ్రవరి 11న మహబూబ్‌నగర్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నగర ప్రజలు, ఓటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఏ డివిజన్ నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో అనే టెన్షన్ ఉండటం సహజం. ఫిబ్రవరి 13న ఎన్నికల ఫలితాల తర్వాత అభ్యర్థుల భవితవ్యం బయటపడనుంది. ఈ క్రమంలో నగరంలో ఉన్న 60 డివిజన్‌లలో ఏ ఒక్కదాంట్లో కూడా 4వేల మంది ఓటర్లు లేకపోవడం విశేషం. 90 శాతం డివిజన్‌లలో 3వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇదే సమయంలో అత్యల్పంగా ఓట్లు ఉన్న డివిజన్ ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. అయితే మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెండు డివిజన్‌లలో ఒక దాంట్లో మొదట ఫలితాలు వస్తే.. మరో దాంట్లో చివర్లో రానున్నాయి. ఈ క్రమంలో డివిజన్‌లో అత్యల్పంగా ఉన్న నాలుగు డివిజన్లను పరిశీలిస్తే 22వ డివిజన్‌లో 2432 మంది ఓటర్లు, 44వ డివిజన్‌లో 2721, 7వ డివిజన్‌లో 2780, 37వ డివిజన్‌లో 2852 మంది ఓటర్లు ఉన్నారు. వీటిలో మొదటి ఫలితం 22వ డివిజన్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇక ఆలస్యంగా ఫలితాలు వచ్చే డివిజన్లను పరిశీలిస్తే 23వ డివిజన్‌లో 3939 ఓటర్లు ఉండగా, 31వ డివిజన్‌లో 3771, 16వ డివిజన్‌లో 3739, 26వ డివిజన్‌లో 3716 ఓటర్లు ఉండటంతో వరుసగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
అమరచింత పట్టణ హ్యూ.
డివిజన్ల సంఖ్య పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
60 97636 100191 14 197841


