కొత్త ఆవిష్కరణలు ఆర్థికాభివృద్ధికి దోహదం | - | Sakshi
Sakshi News home page

కొత్త ఆవిష్కరణలు ఆర్థికాభివృద్ధికి దోహదం

Feb 6 2026 11:52 AM | Updated on Feb 6 2026 11:52 AM

కొత్త ఆవిష్కరణలు ఆర్థికాభివృద్ధికి దోహదం

కొత్త ఆవిష్కరణలు ఆర్థికాభివృద్ధికి దోహదం

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: కొత్త ఆవిష్కరణలు ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. పాఠశాల విద్యాశాఖ, సాక్షర భారత్‌ విభాగం, అఖిలభారత సాంకేతిక విద్యా మండలి, ఎంఐసీల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జేపీఎన్‌సీఈలో పీఎంశ్రీ పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు ఐఈడీ బూట్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం జరిగిన సదస్సులో ఏఐసీటీయూ ఫెలో, పీఓసీ సాగర్‌ హరిహరమణి, కళాశాల చైర్మన్‌ కేఎస్‌ రవికుమార్‌, జిల్లా విద్యాశాఖ అకాడమిక్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు శ్రీనివాస్‌, వెంకటరామారావు, జేఎన్‌టీయూ అనంతాపూర్‌ ప్రతినిధి డా.రాజేశ్‌కుమార్‌, ఇండుపులపాయ ఐఐఐటీ ప్రతినిధి అబ్రహంలతో పాటు 170 మంది ప్రిన్సిపాల్స్‌, జీహెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొని కొత్త ఆవిష్కరణలకు సంబంధించి ఆసక్తికర చర్చలు, ప్రజెంటేషన్లు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement