పుర పోరులో యువ న్యాయవాది | - | Sakshi
Sakshi News home page

పుర పోరులో యువ న్యాయవాది

Feb 6 2026 11:52 AM | Updated on Feb 6 2026 11:52 AM

 పుర పోరులో యువ న్యాయవాది

పుర పోరులో యువ న్యాయవాది

బరిలో దంపతులు

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ 37 డివిజన్‌ నుంచి ప్రముఖ క్రిమినల్‌ న్యాయవాది, కాంగ్రెస్‌ నాయకుడు ఎన్‌పీ వెంకటేశ్‌ కుమార్తె నీలి నేహశ్రీ బరిలో నిలిచారు. జనరల్‌ మహిళకు రిజర్వు కావడం, తండ్రి ప్రోత్సాహంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మహబూబ్‌నగర్‌ జిల్లా కోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. జేపీఎన్‌సీ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించారు. అనంతరం హైదరాబాద్‌ జేఎన్‌టీయూ విశ్వ విద్యాలయం నుంచి ఎంటెక్‌ పూర్తి చేయడంతో పాటు యూనివర్సిటీ టాపర్‌గా నిలిచారు. రాజకీయాల్లో తనకు సీఎం రేవంత్‌రెడ్డి స్ఫూర్తి అని, నాన్న సహకారంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాని, తనకు అవకాశం ఇస్తే ప్రజా సేవకు అంకితమవుతానని నేహశ్రీ పేర్కొన్నారు. ఉన్నత విద్యావంతురాలు కావడంతో కార్పొరేషన్‌ దృష్టి ఈ డివిజన్‌పై పడింది.

నేహశ్రీ

రాష్ట్ర వ్యాప్తంగా అతి తక్కువ జనాభా కలిగిన 5 మున్సిపాలిటీల్లో అమరచింత ఒకటి. ఇక్కడ కేవలం 11,225 మందే మాత్రమే నివసిస్తున్నారు. పట్టణంలోని అన్ని కాలనీలను కలిపి 10 వార్డులుగా విభజించారు. గతంలో చంద్రనాయక్‌తండా, దీప్లానాయక్‌ తండా, తూక్యనాయక్‌ తండా, కొత్త తండాను కలుపుకొని అమరచింత పంచాయతీగా ఉండేది. మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయిన సమయంలో కేవలం అమరచింతతో పాటు కొత్త తండాను విలీనం చేసి మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు.

జనాభా

11,225 మందే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement