ప్రజల ఆశీస్సులతో కార్పొరేషన్‌ గెలుస్తాం | - | Sakshi
Sakshi News home page

ప్రజల ఆశీస్సులతో కార్పొరేషన్‌ గెలుస్తాం

Feb 7 2026 2:01 PM | Updated on Feb 7 2026 2:26 PM

ప్రజల ఆశీస్సులతో కార్పొరేషన్‌ గెలుస్తాం

ప్రజల ఆశీస్సులతో కార్పొరేషన్‌ గెలుస్తాం

కాంగ్రెస్‌ హయాంలో రేషన్‌కార్డుల మంజూరు

జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదరం రాజనర్సింహ

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ప్రజల ఆశీస్సులతో ఈ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ను కాంగ్రెస్‌ పార్టీ కై వసం చేసుకుంటుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదరం రాజనర్సింహ అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంబేడ్కర్‌ కాలనీ, ఎనుగొండలో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం జరిగిన ఏనుగొండ చౌరస్తాలో ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ ఈ జిల్లా అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. విద్య, వైద్యం, మహిళా సాధికారితపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. బాసర తర్వాత మహబూబ్‌నగర్‌ జిల్లాకు ట్రిపుల్‌టీ కళాశాల ఇచ్చానట్లు చెప్పారు. మహబూబ్‌నగర్‌కు ఇంటిగ్రెటెడ్‌ రెసిడెన్షియల్‌, ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల మంజూరు చేశామని, ఇటీవల రూ.600కోట్లతో అండర్‌ డ్రెయినేజీకి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. తొమ్మిదన్నర ఏళ్లలో కాలంలో గత ప్రభుత్వం ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్హులందరికీ రేషన్‌కార్డులు, సన్నబియ్యం, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందజేసినట్లు చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో చరిత్ర, ఒక సిద్ధాంతం ఉందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేసిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహరెడ్డి, నాయకులు వినోద్‌కుమార్‌, చంద్రకుమార్‌గౌడ్‌, మిథున్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement