ఇళ్లు కూల్చేసిన వారే ఓట్లు అడుగుతున్నారు..
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాకేంద్రంలోని క్రిస్టియన్‌పల్లిలోని ఆదర్శనగర్‌లో అంధుల ఇళ్లను కూలకొట్టిన వాళ్లే మళ్లీ ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వస్తున్నారని.. వారికి ఓట్ల ద్వారా తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని క్రిస్టియన్‌పల్లి, పాత పాలమూరు, శివశక్తి నగర్, భగీరథ కాలనీ, వీరన్నపేట, ప్రేమ్‌నగర్, సద్దలగుండు తదితర ప్రాంతాల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముస్లిం, క్రిస్టియన్ పిల్లల చదువు కోసం మైనారిటీ గురుకులాలు కడితే వాటిని మధ్యలోనే నిలిపివేశారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.ఈ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయని విమర్శించారు. ప్రచారంలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు శ్రీనివాసు లు, నవకాంత్ ఇతర నాయకులు పాల్గొన్నారు.


