‘బీజేపీకి లైన్ క్లియర్ చేసుకుంటున్నాడు’
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి నమ్మడం లేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి టికెట్ కోసం యెన్నం లైన్ క్లియర్ చేసుకుంటున్నాడని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి బీజేపీ గెలుపునకు ఎందుకు సహకరిస్తున్నారని ప్రశ్నించారు. సీఎం వెంట ఢిల్లీకిపోయి పాలమూర్‌కు అధిక నిధులు తేవాలని డిమాండ్ చేశారు. ఎంపీ అరుణ అండర్ గ్రౌండ్‌కు నిధులు తెచ్చానని గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ జీఓను తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఒక తల్లి పిల్లలమని చెప్పుకోవడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఈ రెండేళ్లలో మున్సిపాలిటీకి ఒక్క రూపాయి తెచ్చింది లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి మేయర్, డిప్యూటీ మేయర్‌గా గెలిపిస్తే సీఎంతో కొట్లాడి నిధులు తెస్తామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడ మాజీ చైర్మన్ వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్‌నర్సిములు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


