భార్యల స్థానంలో భర్తలు.. భర్తల స్థానంలో భార్యలు
కొల్లాపూర్: స్థానిక మున్సిపాలిటీలోని కొన్ని వార్డుల్లో భర్తల స్థానాల్లో భార్యలు.. భార్యల స్థానాల్లో భర్తలు ఎన్నికల బరిలో నిలిచారు. మున్సిపాలిటీలోని మూడో వార్డులో గత ఎన్నికల్లో మాచుపల్లి బాలస్వామి కౌన్సిలర్‌గా గెలిచారు. ఈసారి ఆ వార్డు మహిళకు రిజర్వు కావడంతో ఆయన భార్య సరోజను పోటీలోకి దింపారు. నాలుగో వార్డులో (గత ఎన్నికల్లో ఐదో వార్డు) మహిమూదాబేగం కౌన్సిలర్‌గా గెలిచి మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఈ స్థానం ఇప్పుడు జనరల్ కావడంతో ఆమె భర్త ఖాధర్‌పాషా కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నారు. పదో వార్డులో (గత ఎన్నికల్లో 11వ వార్డు) బోరెల్లి కరుణ కౌన్సిలర్‌గా గెలిచారు. ఈసారి ఆ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వు కావడంతో ఆమె భర్త బోరెల్లి మహేశ్ కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీలో నిలిచారు. ఈ మూడు స్థానాల్లో తమ పట్టు నిలుపుకొనేందుకు వారు కృషిచేస్తున్నారు.
భార్యల స్థానంలో భర్తలు.. భర్తల స్థానంలో భార్యలు
భార్యల స్థానంలో భర్తలు.. భర్తల స్థానంలో భార్యలు


