1,007 మంది ఉద్యోగులు ఓటేశారు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు గాను 1,007 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. గత నెల 30 నుంచి ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో భాగంగా ఈనెల 7న 458 మంది, 8న 549 మంది స్థానిక మెప్మా భవనంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి వచ్చి పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకున్నారు. మొదట్లో ఈ నెల 3వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఆ తర్వాత కూడా రావడంతో వాటినీ పరిగణలోకి తీసుకోవడం గమనార్హం. కాగా, డివిజన్ల వారీగా ఎన్నెన్ని ఉన్నాయనేది ఇంకా తేల్చలేకపోయారు.


