ఎన్నికల ఉపాధి
జిల్లాలో మున్సిపల్ ప్రచారంలో
348 ఆటోల వినియోగం
పాలమూరు: సాధారణంగా ఒక ఆటో డ్రైవర్ ప్రయాణికులను తరలించడం ద్వారా రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు సంపాదిస్తాడు. ప్రస్తుతం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందడి నెలకొన్నందున కొంతమంది ఆటో డ్రైవర్లకు ప్రత్యేక ఉపాధి దొరికింది. డివిజన్లతో పాటు వార్డుల్లో కార్పొరేటర్, కౌన్సిలర్‌గా పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ప్రచారం కోసం ఒక్కో డివిజన్‌లో రెండు నుంచి మూడు వరకు ఆటోలు ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో ఆటోకు రోజుకు రూ.2 వేలు అద్దె చెల్లించడంతో పాటు డ్రైవర్‌కు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. జిల్లాలో 348 ఆటోలతో పాటు మరో 10 ఇతర వాహనాలు ఈ ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగిస్తున్నారు. భూత్పూర్‌లో 21 ఆటోలు, దేవరకద్రలో 23, మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో 305 ఆటోలు ఎన్నికల ప్రచారంలో భాగమయ్యాయి.


