కుండ చేస్తా.. ఓటు కూడగడతా
వాలేకూం.. సలాం
నాడు.. నేడు.. ప్రత్యర్థులే
గద్వాలటౌన్: ఎన్నికల్లో విజయాన్ని అందిపుచ్చుకోవడానికి నాయకులు పలుమార్లు బరిలోకి దిగుతారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికవ్వాల్నదే వారి ఆశయం. గత ఎన్నికల్లో పోటీ పడిన అభ్యర్థులు ఈ సారి కూడా పోటీ పడడం గమనార్హం. రిజర్వేషన్ మహిళలకు కేటాయిస్తే వారి సతీమణులు, కుటుంబ సభ్యులను బరిలో దించుతుంటారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆయా వార్డుల్లో పోటీ పడిన అభ్యర్థులు తిరిగి తాజాగా ఢీకొంటున్నారు. పట్టణంలోని నాల్గో వార్డు నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు శారద, లలితమ్మ గత ఎన్నికల్లోనూ పోటీపడ్డారు. ప్రస్తుతం 22వ వార్డులో పోటీలో ఉన్న బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లవి, కాంగ్రెస్ అభ్యర్థి లత, 24వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి గోపాల్, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసులు గత మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రత్యర్థులుగానే బరిలో నిలిచారు. 33వ వార్డులో బీజేపీ అభ్యర్థి బండల పద్మావతి, కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల జయలక్ష్మి పోటీలో నిలువగా.. గత ఎన్నికల్లో బండల పద్మావతి మీద జయలక్ష్మి కటుంబ సభ్యులు పోటీ చేశారు. 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జయలక్ష్మి, బీజేపీ అభ్యర్థి బండల రామలక్ష్మి పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లోనూ వీరి కుటంబ సభ్యులు పోటీ పడ్డారు.
రొట్టె కాల్చి.. ఓటు రాబట్టి..
కుండ చేస్తా.. ఓటు కూడగడతా
కుండ చేస్తా.. ఓటు కూడగడతా


