మొదటి విడతర్యాండమైజేషన్ పూర్తి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో మహబూబ్‌నగర్ కార్పొరేషన్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలకు జరుగనున్న ఎన్నికల కౌంటింగ్‌కు మొదటి విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనీదేవి అన్నారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ విజయేందిర తో కలిసి మొదటి విడత ర్యాండమైజేషన్ నిర్వహించి కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అ సిస్టెంట్లకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. 20 శాతం రిజర్వ్‌తో కలుపుకొని 69 కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 139 మంది కౌంటింగ్ అసిస్టెంట్లకు నియామక ఉత్తర్వులు అందజేశారు.
పోస్టల్ బ్యాలెట్‌కు768 దరఖాస్తులు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత నెల 31 నుంచి ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్‌కు 768 దరఖాస్తులు అందినట్లు కమిషనర్ పి.రామాంజులరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి ఈనెల 8వ తేదీ వరకు గడువు ఉందని, అందరూ వినియోగించుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు తమ కార్యాలయ ప్రాంగణంలోని మెప్మా భవనంలో కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.
ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించడంతో పాటు జ్ఞాపకశక్తిని మెరుగుపర్చుకోవడం అత్యంత ముఖ్యమని ఆంగ్ల యజ్ఞం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లిష్ డైరెక్టర్ ఏఎస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఐక్యూఏసీ ఆధ్వర్యంలో ‘ఇంగ్లిష్ నైపుణ్యాలతో పాటు జ్ఞాపకశక్తిని ఎలా మెరుగుపరచుకోవాలి’అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞాపకశక్తి పెంపొందించుకునే పద్ధతులు, చదువు మీద ఏకాగ్రత, రోజువారీ అలవాట్లు, ఇంగ్లిష్ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే సులభ మార్గాల గురించి విద్యార్థులకు వివరించారు. జ్ఞాపకశక్తిని పెంచుకోవడం ద్వారా విద్యార్థులు విద్యలో, వ్యక్తిత్వ వికాసంలో ముందుకు సాగవచ్చన్నారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డా. జె. శ్రీదేవి పాల్గొన్నారు.
చెరువును సురక్షితంగా
ఉంచేందుకు తగిన చర్యలు
మహమ్మదాబాద్: కుంగిన చెర్వు కట్ట, తూమును సురక్షితంగా ఉంచేందుకు అన్ని విధాలుగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకోనున్నట్లు డ్యాం సేఫ్టీ, జియాలజిస్టు అధికారులు రాజు, కృష్ణారెడ్డి తెలిపారు. మహమ్మదాబాద్ మండలంలో 560 ఎకరాల ఆయకట్టు మల్కచెర్వు కట్టకు ప్రమాదం పొంచి ఉండడంతో శుక్రవారం డ్యాంసేఫ్టీ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు కట్ట ప్రాంతం లీకేజీ అయ్యే ప్రాంతం, తూము తదితర వాటిని పరిశీలించారు. కట్ట మధ్యలో వెనకాల నీరు ఉబికి వస్తున్నందున కట్టకు కొంత ప్రమాదం ఉన్నట్లు గుర్తించారు. చెర్వు కట్ట, తూము, అలుగు ప్రాంతం పునర్ నిర్మాణం చేపట్టి ఎలాంటి ప్రమాదం లేకుండా చేయా లని రైతులు కోరారు. మల్కచెర్వు ప్రమాదం బారిన పడకుండా అన్ని రకాల రక్షణాత్మక చర్యలు తీసుకునేందుకు నివేదిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. డ్యాం సేఫ్టీ అధికారులు ఈఈ శ్రీలత, డిప్యూటీ ఈఈ సతీష్‌కుమార్, శైలజ, డీఈఈ కృష్ణారెడ్డి, ఈఈ రమాదేవి, ఏఈ దిలీప్‌కుమార్ పాల్గొన్నారు.
మొదటి విడతర్యాండమైజేషన్ పూర్తి


