మక్తల్ @ 70
మొదటి మున్సిపాలిటీగా..
1956లో మక్తల్ తొలి మున్సిపాలిటీగా ఏర్పడింది. 1958లో మొదటి మున్సిపల్ చైర్మగా గిరినాగప్ప ఎన్నికయ్యారు. అనంతరం లక్ష్మణరావు– 1960– 62, నీలకంఠం 1962– 64లో మున్సిపల్ చైర్మన్లుగా పనిచేశారు. అనంతరం మున్సిపల్ హోదా తొలగించారు.
మక్తల్: 70 ఏళ్ల క్రితం మున్సిపాలిటీగా ఏర్పడిన మక్తల్ అనేక రాజకీయ పరిణామాల మధ్య తిరిగి మేజర్ పంచాయతీగానూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక తిరిగి మున్సిపాలిటీగా మారి అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది.


