కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణ చూడలేకనే విమర్శలు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణ చూడలేకనే విమర్శలు

Feb 9 2026 8:33 AM | Updated on Feb 9 2026 8:33 AM

కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణ చూడలేకనే విమర్శలు

కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణ చూడలేకనే విమర్శలు

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక మాజీ మంత్రి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. కార్పొరేటర్‌ టికెట్లను ఎమ్మెల్యే నిర్ణయించారని మాజీ మంత్రి చెప్పడం అవాస్తవమన్నారు. ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ కమిటీ సమష్టి నిర్ణయం మేరకు కార్పొరేషన్‌లో డివిజన్‌లకు టికెట్ల కేటాయింపులు జరిగిందన్నారు. మా పార్టీ అంతర్గత విషయంలో మాజీ మంత్రి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే కృషి వల్లే మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌గా ఏర్పడిందన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్‌ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో అందరం కలిసే ఉన్నామని, ఏ నిర్ణయమైనా సమష్టిగానే తీసుకుంటామన్నారు. మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాల మాటలను ప్రజల్లో నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బెక్కరి అనిత, నాయకులు వినోద్‌కుమార్‌, చంద్రకుమార్‌గౌడ్‌, సీజే బెనహర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement