పరిశుభ్రంగా ఉంచుకోవాలి
నగరాన్ని అందరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా పార్కులు ఆహ్లాదకరంగా ఉండాలి. జాతీయ రహదారి 167పై ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగినా ఆ మేరకు సౌకర్యాలు కల్పించకపోవడం దారుణం. తక్షణమే సిగ్నల్స్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. పార్కింగ్ స్థలాలు లేక ఎక్కడబడితే అక్కడ నడిరోడ్లపై వాహనాలను నిలిపివేస్తున్నారు. పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
– జగపతిరావు, సీనియర్ సిటిజన్స్ ఫోరం
అధ్యక్షుడు, మహబూబ్‌నగర్


