నేటి ‘ప్రజావాణి’ రద్దు | - | Sakshi
Sakshi News home page

నేటి ‘ప్రజావాణి’ రద్దు

Feb 9 2026 8:33 AM | Updated on Feb 9 2026 8:33 AM

నేటి

నేటి ‘ప్రజావాణి’ రద్దు

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: మున్సిపల్‌ ఎన్నికల దృష్ట్యా సోమవారం నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ విజయేందిర బోయి ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం ఈ కార్యక్రమాన్ని తిరిగి నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు.

పోలింగ్‌ రోజు

స్థానిక సెలవు: కలెక్టర్‌

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు పోలింగ్‌ రోజు ఫిబ్రవరి 11న స్థానిక సెలవు దినంగా ప్రకటిస్తూ కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి విజయేందిర ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పోలింగ్‌స్టేషన్లు ఉన్న అన్ని ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థల భవనాలు, పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన ఇతర భవనాలలో పనిచేస్తున్న సిబ్బందికి పోలింగ్‌ ముందు రోజు ఫిబ్రవరి 10వ తేదీ రోజు కూడా సెలవు ప్రకటించారు. మహబూబ్‌ నగర్‌ కార్పొరేషన్‌, దేవరకద్ర, భూత్పూర్‌ మునిసిపాలిటీ ప్రాంతాలలో ఎన్నికలకు నోటిఫై చేయబడిన ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు/సంస్థలకు ఆ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా స్థానిక సెలవుగా ప్రకటించారు.

48 గంటల పాటు

మద్యం దుకాణాలు బంద్‌

పాలమూరు: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళి అనుసరిస్తూ జిల్లాలో ఎన్నికలు జరిగే మహబూబ్‌నగర్‌, దేవరకద్ర, భూత్పూర్‌ మున్సిపాలిటీలలో సోమవారం 5 గంటల నుంచి ప్రచారంపై నిషేదం అమల్లోకి వస్తుందని కలెక్టర్‌ విజయేందిర బోయి ఒక ప్రకటనలో తెలిపారు. నేడు సా యంత్రం 5 గంటల నుంచి ఈ నెల 11న పో లింగ్‌ ముగిసే మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు మూసివేయాలని, అలాగే కౌంటింగ్‌ జరగనున్న 13వ తేదీన కూడా మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు.

అలరించిన

పద్యనాటక ప్రదర్శనలు

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని దేవాలయం ప్రాంగణంలో మిత్ర కళానాట్య మండలి ఆధ్వర్యంలో పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు ఆదివారం రెండో రోజు కొనసాగాయి. శ్రీకృష్ణరాయబారం, శ్రీరామాంజనేయ యుద్ధం పూర్తి నాటకం, హరిశ్చంద్ర కాటికసీను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమిత్ర కళానాట్యమండలి ప్రధాన కార్యదర్శి వి.నారాయణ మాట్లాడుతూ మన్యంకొండ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని కొన్నేళ్ల నుంచి పద్యనాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పద్యనాటక ప్రదర్శనలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు తెలిపారు. ప్రదర్శనలు ఈనెల 11వ తేదీ వరకు ఉంటాయని వెల్లడించారు.

ఉత్సాహంగా ఆలిండియా కరాటే చాంపియన్‌షిప్‌

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం వీఐపీ ఆలిండియా కరాటే చాంపియన్‌షిప్‌ ఉత్సాహంగా జరిగింది. పలు రాష్ట్రాల నుంచి దాదాపు 500 వందలాది మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. వివిధ కేటగిరిల్లో కతాస్‌, కుమితే, వెసన్‌ పోటీలు నిర్వహించారు. 14 విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి గ్రాండ్‌చాంపియన్‌షిప్‌లు అందజేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి మెడల్స్‌, సర్టిఫికెట్లు అందజేశారు. పలువురు కరాటే మాస్టర్లు మాట్లాడుతూ ప్రస్తుతం కరాటే మార్షల్‌ ఆర్ట్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. కరాటే మార్షల్‌ ఆర్ట్స్‌తో దేహదారుఢ్యంతోపాటు మానసికంగా ఎదగవచ్చని అన్నారు. ఇలాంటి టోర్నమెంట్‌ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో టోర్నమెంట్‌ చీఫ్‌ ఆర్గనైజర్‌ సయ్యద్‌ అశ్వాక్‌, జీకే మాస్టర్‌ ఆలిండియా చీఫ్‌ క్రిష్ణయ్య, సీనియర్‌ మాస్టర్లు ఇలియాజ్‌ బిన్‌ సిద్దిఖీ, రవికుమార్‌, జగదీష్‌, కనకరాజ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

నేటి ‘ప్రజావాణి’ రద్దు 
1
1/1

నేటి ‘ప్రజావాణి’ రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement