వామన్‌పల్లిలో చిరుత సంచారం..?
ధరూరు: జూరాల బ్యాక్ వాటర్ పరిధిలోని వామన్‌పల్లి గ్రామ శివారులో చిరుత సంచరించినట్లు గ్రామస్తులు, రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి నల్లగట్టు ప్రాంతంలో గుర్తు తెలియని జంతువు ఆవు దూడను ఎత్తుకెళ్లింది. దీంతో గ్రామస్తులు చిరుత సంచరిస్తున్నట్లు భయాందోళనకు గురవుతున్నారు. ముందుగా ఆవు దూడను ఎత్తుకెళ్లింది గుర్తు తెలియని జంతువుగా భావించినప్పటికీ.. అక్కడి పరిసర ప్రాంతాల్లోని జాడలను బట్టి చిరుతపులి లేక హైనాకు సంబంధించిన గుర్తులు ఉన్నట్లు గ్రామ సర్పంచు పర్ణికా కృపాకర్‌రెడ్డి తెలిపారు. అటవీ శాఖ అధికారులకు తెలియజేయగా వారు జాడలను పరిశీలించి వెళ్లినట్లు పేర్కొన్నారు. రైతులు పశువులను పొలాల వద్ద కట్టేయవద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు.
వామన్‌పల్లిలో చిరుత సంచారం..?


