లెక్కింపులో పొరపాట్లకు తావివ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

లెక్కింపులో పొరపాట్లకు తావివ్వొద్దు

Feb 7 2026 2:40 PM | Updated on Feb 7 2026 2:40 PM

లెక్కింపులో పొరపాట్లకు తావివ్వొద్దు

లెక్కింపులో పొరపాట్లకు తావివ్వొద్దు

పాలమూరు: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేయాలని.. ఎక్కడా పొరపాట్లకు తావివ్వొద్దని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ విజయేందిర బోయి, జనరల్‌ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయినీదేవి అన్నారు. ఎన్నికల పోలింగ్‌ తర్వాత బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచే పీయూలోని స్ట్రాంగ్‌రూమ్‌లతో పాటు ఓట్ల లెక్కింపు కేంద్రాలను శుక్రవారం వారు పరిశీలించారు. పీయూలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, స్టోర్ట్స్‌ కాంప్లెక్స్‌ల్లో మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌, దేవరకద్ర ఓట్ల లెక్కింపు, ఫార్మా స్యూటికల్‌ కళాశాల భవనంలో భూత్పూర్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఓట్ల లెక్కింపునకు అవసరమైన సామగ్రిని ముందుగానే సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement