వాయు, శబ్ద కాలుష్యం అరికట్టాలి
నగరంలో పెరుగుతున్న వాహనాల కారణంగా వాయు, శబ్ద కాలుష్యం వెదజల్లుతోంది. దీనివల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలి. గల్లీలలో విద్యుత్ స్తంభాలు, తీగలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. తాగునీటి సరఫరా సరిగ్గా జరగడం లేదు. నగరంలో సిటీ బస్సులను ప్రవేశపెడితే ఆటోవాలాల ఆగడాలను అరికట్టవచ్చు. ప్రధాన రోడ్లపై వాహనాల రద్దీతో ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. రవాణా సౌకర్యం మెరుగుపరిచి అందరికీ సౌకర్యంగా ఉండేలా చూడాలి.
– లక్ష్మణ్‌గౌడ్, మెట్టుగడ్డ


