
ధర్మస్థల: నా రోజువారి ఆదాయం కేవలం రూ.50 మాత్రమే. కానీ నెలకు రూ.15 లక్షల జీతాలు చెల్లించాల్సి వస్తోంది. నా బాధను అర్థం చేసుకోండి," అంటూ బాలీవుడ్ క్వీన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆవేదన వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ మాన్సూన్ సీజన్‌లో కుండపోత వర్షాలు, క్లౌడ్‌బరస్ట్‌లు హిమాచల్‌ను అతలాకుతలం చేశాయి. జూన్ 20 నుంచి ప్రారంభమైన వర్షాల కారణంగా ఇప్పటివరకు 419 మంది మరణించారు. వీరిలో 237 మంది వరదలు, కొండచరియలు, నీటి ప్రవాహం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇటీవల జరిగిన క్లౌడ్‌బరస్ట్ దాటికి రాష్ట్రం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గమైన మండి జిల్లాలో పర్యటించిన కంగనా, వరద బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో మనాలీలో ప్రారంభించిన ‘ది మౌంటెన్ స్టోరీ’ రెస్టారెంట్ వరదల కారణంగా పర్యాటకులు తగ్గిపోవడంతో తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటోంది.
‘నిన్న నా రెస్టారెంట్ ఆదాయం కేవలం రూ.50 మాత్రమే. కానీ నెలకు రూ.15 లక్షల జీతాలు చెల్లించాలి. నా బాధను అర్థం చేసుకోండి. నేనూ హిమాచలీనే’ అని ఆమె అన్నారు.
సోలాంగ్, పల్చన్ ప్రాంతాల్లో పర్యటించిన కంగనాకు స్థానికులు 15–16 ఇళ్లు ప్రమాదంలో ఉన్నాయని వివరించారు. బియాస్ నది కొండచరియలు విరిగిపడి గ్రామాలను ప్రమాదంలోకి నెట్టాయని చెప్పారు. అందుకే బియాస్ నది ప్రవాహాన్ని మళ్లించాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు సూచించారు.
MP Kangana Ranaut listens to a flood victim in Himachal, but responds by complaining about her own restaurant’s poor earnings — "only ₹50" made.#KanganaRanaut #HimachalFloods #Controversy@KanganaTeam pic.twitter.com/iANqskVacm
— Atulkrishan (@iAtulKrishan1) September 18, 2025