
సాక్షి,తెలంగాణ: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షం హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బీభత్స సృష్టిస్తోంది. వర్షం కారణంగా వాగులు,వంకలు,లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. వరద ధాటికి వరదనీరు పొంగిపొర్లుతుంది. వరద ప్రవాహాతో పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని గడుపతున్నారు
ఈ క్రమంలో రాష్ట్రంలో వర్ష బీభత్సంపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. భారీ వర్షాలతో తెలంగాణ నీట మునుగుతున్నది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు సాయం కోసం అర్థిస్తున్నారు. సీఎం మాత్రం తీరిగ్గా బీహార్‌లో ఎన్నికల యాత్ర చేస్తున్నారు. ఎప్పుడొస్తాయో తెలియని బీహార్ ఎన్నికల కోసం..తెలంగాణకు సంబంధమే లేని బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ సీఎం, మంత్రివర్గం కాంగ్రెస్ అధిష్ఠానం ముందు మోకరిల్లింది
అధిష్ఠానం ఆశీస్సులతో.. పదవులు కాపాడుకుని ఖజానా కొల్లగొట్టే ధ్యాస తప్పితే ఆరు గ్యారంటీలు..420 హామీల అమలు గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదు. వరదలతో ప్రజలు..యూరియా దొరక్క రైతులు.. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు
చాలా చోట్ల వరదనీటిలో మునిగి ప్రజలు హెలికాప్టర్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.తెలంగాణ ప్రజల సొమ్ముతో ప్రైవేట్ జెట్లలో ఊరేగుతున్న కాంగ్రెస్ సీఎం, మంత్రులకు ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్‌ల కన్నా అధ్వాన్నంగా 100 కిలోమీటర్ల లోపు ప్రభుత్వ కార్యక్రమాలకు హెలికాప్టర్‌ను వినియోగిస్తున్న ఈ నేతలకు ఇప్పుడైనా హెలికాప్టర్ పంపి ప్రజల ప్రాణాలు రక్షించే తీరిక ఉందో,లేదో ?
కాంగ్రెస్ నేతలారా.ఓట్లు కాదు..ప్రజల పాట్లు చూడండి..ఎన్నికలు కాదు..ఎరువుల కోసం రైతుల వెతలు చూడండి. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది’అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారీ వర్షాలతో తెలంగాణ నీట మునుగుతున్నది
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని
ప్రజలు సాయం కోసం అర్థిస్తున్నారు
సీఎం మాత్రం తీరిగ్గా
బీహార్ లో ఎన్నికల యాత్ర చేస్తున్నాడు
ఎప్పుడొస్తాయో తెలియని బీహార్ ఎన్నికల కోసం
తెలంగాణకు సంబంధమే లేని బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ సీఎం, మంత్రివర్గం… pic.twitter.com/AuZrpbwjN7— KTR (@KTRBRS) August 27, 2025