
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో కుండపోత వానలు, వరదల నేపథ్యంలో కొనసాగుతున్న సహాయక చర్యలపై రాష్ట్ర డీజీపీ జితేందర్ స్పందించారు. వర్షాలు, వరదలపై పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగానే ఉందని.. 24 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు.
గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వర్షాలు, వరదలపై అన్నిప్రాంతాల్లో పోలీస్ వ్యవస్థ అలర్ట్‌గా ఉంది. ఇప్పటివరకు 1,200మందిని కాపాడాం. కామారెడ్డి, రామయంపేట్, నిర్మల్, మెదక్ జిల్లాలో వరద ఉధృతి తగ్గింది. అయినా రెస్క్యూ చేస్తూనే ఉన్నాం. పోలీసులు 24గంటలు రెస్క్యూ టీమ్‌తో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటూనే ఉన్నారు.
ఎస్డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బందితో కలిసి పోలీసులు పని చేస్తున్నారు. సకాలంలో ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు స్పాట్‌కు చేరుకోవడంతో భారీ ముప్పు తప్పింది. కామారెడ్డిలో చాలా మందిని రక్షించాం. బోట్స్, లైఫ్ జాకెట్లతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేర్చాం. వరదలపై కంట్రోల్ రూం నుంచి 24 గంటలు మానిటరింగ్ చేస్తూనే ఉన్నాం అని డీజీపీ జితేందర్ వెల్లడించారు.
చిత్రాల కోసం క్లిక్ చేయండి👉 సముద్రం కాదహే.. కామారెడ్డి రోడ్లు!!