
న్యూఢిల్లీ: వరదల కారణంగా యమునా నది నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఆగ్రాలోని అద్భుత తాజ్ మహల్ గోడలను యమునా నది తాకింది. సోషల్ మీడియాలో దీనికి సంబందించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. యమునా నదిలో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతుండటంతో నది ఘాట్‌లు, చుట్టూ ఉన్న ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయి.
పెరుగుతున్న నీటి మట్టాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దిగువ హిమాలయ ప్రాంతంలో, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షపాతం కారణంగా యమునలోకి నీరువచ్చి చేరింది.
Yamuna River floods reach Taj Mahal walls, surpassing danger mark. Heavy rains in Himachal and Uttarakhand triggered the surge, flooding Agra homes and prompting evacuations and flood alerts.
.
.
.#YamunaRiver #TajMahal #AgraFloods #HeavyRainfall #Uttarakhand #HimachalPradesh… pic.twitter.com/NQsjqiDez5— The Daily Guardian (@DailyGuardian1) September 8, 2025
ప్రస్తుతం యమునలో నీటిమట్టం 205.33 మీటర్ల ప్రమాద స్థాయిని దాటిందని స్థానిక జిల్లా యంత్రాంగం ధృవీకరించింది. దసరా ఘాట్, యమునా కారిడార్ సమీపంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.
2023లో యమునలోని నీటి మట్టాలు కూడా ఇదే స్థాయికి చేరుకున్నాయని స్థానిక చరిత్రకారుడు రాజ్ కిషోర్ రాజే తెలిపారు. అయితే అన్ని పరిస్థితులను తట్టుకునేలా నిర్మించిన తాజ్ మహల్‌కు వరదల కారణంగా ఎటువంటి హాని జరగదన్నారు. ఆగ్రా జిల్లా యంత్రాంగం యమునలోని పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. యమునా నదిలోని నీటిమట్టం 206 మీటర్ల మార్కును దాటితే సమీప ప్రజలను ఇక్కడి నుంచి ఖాళీ చేయవలసి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.