
ప్రకాశం బ్యారేజీ నుంచి 4.16 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి
ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 13.42 లక్షల క్యూసెక్కులు కడలిలోకి
సాక్షి, అమరావతి, పోలవరం రూరల్, ధవళేశ్వరం, విజయపురిసౌత్: వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి క్రమేణా తగ్గుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి 4,33,398 క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టా కాలువలకు 16,776 క్యూసెక్కులు వదలుతూ మిగులుగా ఉన్న 4,16,622 క్యూసెక్కులను అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.
ధవళేశ్వరం బ్యారేజీలోకి 13,54,996 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 12,600 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 13,42,396 క్యూసెక్కుల గోదావరి జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 5,26,876 క్యూసెక్కులు కృష్ణాజలాలు చేరుతుండగా.. 4,86,493 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి 4,32,217 క్యూసెక్కులు చేరుతుండగా.. 4,05,532 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 3,82,121 క్యూసెక్కులు చేరుతుండగా 3,58,902 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి 11,75,859 క్యూసెక్కులు చేరుతుండగా అంతే పరిమాణంలో దిగువకు వదిలేస్తున్నారు.