
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి తన విచిత్రమైన వ్యాఖ్యలతో ట్రోల్ అవుతున్నారు. పాకిస్తాన్‌ను వరదలు ముంచెత్తిన వేళ.. ఆ వరదల్ని ప్రజలు వరంగా భావించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు వరద ప్రవాహనాన్ని అడ్డుకునేందుకు వరద నీటిని బకెట్లు,ట్యూబ్‌లలో నింపాలని విజ్ఞప్తి చేశారు.
పాక్‌లో ఇటీవల రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఫలితంగా రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పంజాబ్ ప్రావిన్స్ మొత్తం నీట మునిగింది. 24 లక్షల మంది పౌరులు వరద ముంపుకు గురయ్యారు. వేలాది గ్రాముల నీట మునిగాయి. భారీ ఎత్తున ఆస్తినష్టం,ప్రాణ నష్టం సంభవించింది.
ఈ క్రమంలో ఆదేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్థానిక మీడియా సంస్థ దున్యా న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ..వరద ముంపు గురైన ప్రజలే.. వరద నీటిని ఇంట్లోకి తోడుకోవాలి. ప్రజలు ఈ వరద నీటిని తమ ఇళ్లలో టబ్‌లు, కంటైనర్లలో నిల్వ చేసుకోవాలి. వరద నీటిని దేవుడి ఆశీర్వాదంగా చూడాలి. అందుకే ఆ నీటిని నిల్వచేయాలని’ పిలుపునిచ్చారు.
అంతేకాదు, పాకిస్తాన్ 10-15 సంవత్సరాలు మెగా ప్రాజెక్టుల కోసం వేచి ఉండకుండా త్వరగా పూర్తి చేయగల చిన్న,చిన్న డ్యామ్‌లను నిర్మించాలని ఆసిఫ్ సూచించారు.మనం నీటిని కాలువలోకి వదిలేస్తున్నాం.అలా వదిలేయకూడదు.ఆ నీటిని నిల్వ చేసుకోవాలన్నారు.
పాకిస్తాన్‌లో భారీ వర్షాల కారణంగా, పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులలో వరద పరిస్థితి నెలకొంది. 5 లక్షల మంది తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వచ్చింది. పాకిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) ప్రకారం జూన్ 26 నుంచి ఆగస్టు 31 వరకు పాకిస్తాన్‌లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 854కి పెరిగింది. 1100 మందికి పైగా గాయపడ్డారు. NDMA ప్రకారం మరణాలలో మూడింట రెండు వంతుల మంది ఇళ్ళు కూలిపోవడం, ఆకస్మిక వరదల కారణంగా సంభవించగా వందలాది మంది మృతి చెందారు. పంజాబ్ చరిత్రలో ఇది అతిపెద్ద వరద అని పంజాబ్ మంత్రి ఔరంగజేబ్ అన్నారు. సట్లెజ్, చీనాబ్, రావి నదుల నీటి మట్టం ఇంతగా పెరగడం ఇదే మొదటిసారి.
Strongly condemn tone deaf comments by Defence Minister Khawaja Asif against the people of Sindh.
"Sindhis were blocking roads for the river. They should consider these floods as a blessing and keep the water in their homes." pic.twitter.com/UkKdBHCeis— Kumail Soomro (@kumailsoomro) September 1, 2025