అక్కాచెల్లెమ్మలకు వైఎస్ ‌జగన్‌ రాఖీ శుభాకాంక్షలు | Raksha Bandhan 2026, YS Jagan Extends Warm Wishes To Women, Says Their Love Gives Him Immense Strength | Sakshi
Sakshi News home page

అక్కాచెల్లెమ్మలకు వైఎస్ ‌జగన్‌ రాఖీ శుభాకాంక్షలు

Aug 28 2026 7:37 AM | Updated on Aug 28 2026 9:53 AM

Raksha Bandhan 2026: YS Jagan Extends Warm Wishes

సాక్షి, తాడేపల్లి: దేశవ్యాప్తంగా రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్కాచెల్లెమ్మలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. 

మీ ప్రేమాభిమానాలే నా బలం, నాకు కొండంత ధైర్యం. మీ సోదరుడిగా నాపై మీరు చూపుతున్న ఆప్యాయ‌త‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఈ రాఖీ పౌర్ణమి మీ అందరి జీవితాల్లో ఆనందాలు, ప్రేమానుబంధాలు, ఆయురారోగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ ఈ ఉదయం ఓ ట్వీట్‌ చేశారాయన.

అంతకు ముందు.. నిన్నటి రాఖీ సందేశంలో ‘ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి చిన్నారికి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు. రక్షాబంధనం.. ఆత్మీయత, అనురాగాల పండుగ. అక్కాచెల్లెమ్మలకు ఎల్లప్పుడూ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా. ప్రతి అక్క, చెల్లెమ్మకు దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలి’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. రక్షాబంధన్‌ సందర్భంగా కుటుంబాల్లో సంతోషం, ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరియాలని.. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి నెలకొనాలని ఆయన కోరుకున్నారు.

క్లిక్‌ చేయండి: రక్షాబంధన్‌: జగనన్నకు రాఖీ కట్టిన వైఎస్సార్‌సీపీ నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement