మరమ్మతులు చేయించాలి
కైకలూరు: జిల్లా కేంద్రం ఏలూరు నుంచి కైకలూరును అనుసంధానం చేసే మణుగునూరులంక వద్ద పెదయడ్లగాడి వంతెన ప్రమాదభరితంగా మారుతోంది. పలుచోట్ల వంతెన రెయిలింగ్‌లు దెబ్బతినడంతో పాటు వంతెన బీటలు వారింది. రాత్రిళ్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏటా వర్షాకాలంలో ఎగువ నుంచి పెద్దఎత్తున గుర్రపుడెక్క కొట్టుకురావడం, ఈ వంతెన ఖానాల వద్ద పేరుకుపోవడం జటిల సమస్యగా ఉంది. వంతెనకు తక్షణం మరమ్మతులు చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.
కొల్లేరు నీరు వంతెన మీదుగా..
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 12 మండలాల పరిధిలో 2,22,300 ఎకరాల విస్తీర్ణంలో కొ ల్లేరు సరస్సు విస్తరించి ఉంది. కొల్లేరు పరీవాహకంలో 122 గ్రామాలున్నాయి. బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు, చంద్రాలు, వట్లూరు డ్రెయిన్లు, గుండేరు, దోసపాడు వాగు, మొండుకోడు, ఏలూరు కాల్వ, ఎస్సేపుల, తోకలపల్లి, పందికోడు, పోల్‌రాజ్, కై కలూరు శ్యాంప్ వంటి 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా వరదల సమయంలో 1.10 లక్షల క్యూసెక్కుల నీరు కొల్లేరుకు చేరుతుంది. ఈ నీరంతా కొల్లేరుకు చేరిన నీరు పెదయడ్లగాడి వంతెనకు చేరుతుంది. అక్కడ నుంచి ఉప్పుటేరు ద్వారా సముద్రానికి చేరాలి.
65 వేల క్యూసెక్కుల నీరు
పెదయడ్లగాడి–ఉప్పుటేరు మధ్య దూరం 18 కిలోమీటర్లు ఉంది. ప్రస్తుత కాలంలో పెదయడ్లగాడికి 65 వేల క్యూసెక్కుల నీరు వస్తుంది. ఇందులో 20 వేల క్యూసెక్కుల నీరు చినయడ్లగాడి ద్వారా పంపడానికి వంతెన నిర్మాణం గతంలోనే జరిగింది. పెదయడ్లగాడి నుంచి పెనుమాకలంక, ఇంగిలిపాకలంక రహదారి నిర్మాణం కారణంగా నీటి పారుదలకు అడ్డువచ్చి ఆ ప్రభావం వంతెనపై పడుతోంది.
50 ఏళ్లు దాటిన నిర్మాణం
రెడ్డిరాజుల కాలంలో ఏలూరు–కై కలూరు మధ్య పరిపాలకరెడ్లు, పాలానా విభాగపు రెడ్లు నివసించేవారు. వీరిలో పెద్దరెడ్లు ఉండే ప్రాంతాన్ని పెదరెడ్లగాడి, చిన్న రెడ్లు నివసించే ప్రాంతాన్ని చినరెడ్లగాడి అని పిలిచేవారు. కాలక్రమంలో పెదయడ్లగాడి, చినయడ్లగాడిగా రూపాంతరం చెందాయి. 1975 జూన్ 23న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పెదయడ్లగాడి వంతెనను ప్రారంభించారు. ఈ వంతెన ప్రారంభంతో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు రవాణా సౌకర్యం ఏర్పడింది.
ప్రమాదకరంగా పెదయడ్లగాడి వంతెన
దెబ్బతిన్న బ్రిడ్జి రెయిలింగ్‌లు
విద్యుత్ దీపాలు లేక ప్రమాదాలు
ఏటా వంతెన ఖానాల వద్ద పేరుకుపోతున్న గుర్రపుడెక్క
కై కలూరు–ఏలూరు రహదారిలో పెదయడ్లగాడి వంతెన కీలకం. రోజూ ఆక్వా సంబంధిత పనులకు వేలాది మంది ఇటుగా ప్రయాణిస్తున్నారు. ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ఈ వంతెనే ప్ర ధానం. వంతెనకు పూర్తిస్థాయిలో మరమ్మ తులు చేయించాలి. బ్రిడ్జిపై విద్యుత్ దీపాలు వేయించేలా చర్యలు తీసుకోవాలి.
–బలే నాగరాజు, ఆక్వారైతు,
కొవ్వాడలంక, మండవల్లి మండలం


