భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా గ్రంథాలయ సంస్థకు మున్సిపాలిటీలు, పంచాయతీలు ప్రతినెలా గ్రంథాలయ సెస్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి గ్రంథాలయ సెస్ చెల్లింపులు, వేసవి విజ్ఞాన శిబిరాల నిర్వహణ తదితర అంశాలపై డీపీఓ, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ ఎంపీడీఓలు, శాఖా గ్రంథాలయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వా రా సమీక్షించారు. మున్సిపాలిటీల వారీగా సెస్ బకాయిల వివరాలను తెలుసుకున్నారు. సెస్ వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీపీఓ వై.దోసిరెడ్డిని ఆదేశించారు. జిల్లాలోని 31 గ్రంథాలయాల్లో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలపై పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే గ్రంథాలయాలకు పుస్తకాలను విరాళంగా అందజేసే దాతల పేర్లను ప్రత్యేక బోర్డుపై ప్రదర్శించాలని, దీని ద్వారా మరింత మంది ప్రేరణ పొందుతారన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బీఈడీ కోర్సులో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే ఎడ్‌సెట్ పరీక్షలు శుక్రవారం నగరంలోని 3 కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్‌లో ఉదయం 170 మందికి 119 మంది, సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 201 మందికి 166 మంది, మ ధ్యాహ్నం 199 మందికి 150 మంది, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 135 మందికి 106 మంది హాజరయ్యారు.


