ఏమార్చి.. ఎగ్గొట్టి! | - | Sakshi
Sakshi News home page

ఏమార్చి.. ఎగ్గొట్టి!

May 11 2026 9:43 AM | Updated on May 11 2026 9:43 AM

రెండేళ్లుగా ఎగవేత

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో..

భీమవరం(ప్రకాశం చౌక్‌) : పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సా యం అందించే పథకానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. ఉచితంగా అందించాల్సిన సాయానికి బదులు అప్పు ఇచ్చే ‘వ్యాపార’ పథకాన్ని ప్రకటించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. డ్వాక్రా గ్రూపుల్లో ఉండే సభ్యుల ఇళ్లల్లో ఆడపిల్లల వివాహాలకు రూ.లక్ష సీ్త్ర నిధి నుంచి రుణంగా ఇప్పించి 48 వాయిదాల్లో తిరిగి చెల్లించేలా కల్యాణలక్ష్మి పేరుతో పథకాన్ని రూపొందించింది. సంక్షేమాన్ని విస్మరించి, పేదలను ఏమార్చేలా తీసుకువచ్చిన ఈ పథకంపై పేదలు పెదవి విరుస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీల్లోని భవన నిర్మాణ కార్మికుల ఇళ్లలో ఆడబిడ్డలు, దివ్యాంగుల వివాహాలకు రూ.40 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు సాయం అందించి ఆదుకున్నారని గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పటికే డ్వాక్రా రుణాలు చెల్లించేందుకు నానా అవస్థలు పడుతున్న పేద మహిళలు.. ఇప్పుడు కల్యాణలక్ష్మి అప్పు తీసుకుంటే ఎలా వాయిదాలు చెల్లించగలరని ప్రశ్నిస్తున్నారు. డ్వాక్రా గ్రూపుల్లో లేని సభ్యుల సంగతేంటని అంటున్నారు. వివాహాలకు ఆర్థిక సాయాన్ని పూర్తి ఉచితంగా అందించాలని కోరుతున్నారు.

డ్వాక్రా మహిళల కుమార్తెలకు

రూ.లక్ష వరకు రుణం

4 శాతం వడ్డీ

48 వాయిదాల్లో చెల్లింపు

సాయం మానేసి

అప్పు ఇస్తారట..

కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లల్లో పెళ్లికానుక పథకాన్ని అమలు చేయలేదు. దీంతో జిల్లాలో సుమారు 6 వేల మంది వరకు ఆర్థికసాయం కోల్పోయారు. 2014లోనూ చంద్రబాబు పెళ్లికానుక ఇస్తానని చెప్పినా అప్పటి టీడీపీ ప్రభుత్వంలోనూ అమలు చేసిన దాఖలాలు లేవు. కనీసం కూటమి ప్రభుత్వంలో అయినా సాయం అందిస్తారని ఎదురుచూసిన ప్రజలకు నిరాశే ఎదురైంది. తాజాగా కల్యాణలక్ష్మి (అప్పు) పథకాన్ని ప్రకటించడంపై పేద లు నిట్టూరుస్తున్నారు.

2019–24లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కల్యాణమస్తు, షాదీతోఫా పేరుతో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సామాజికవర్గాల వారీగా వివాహాలకు ఆర్థిక సాయం అందించారు. ప్రతి మూడు నెలలకోసారి లబ్ధిదారులను ఎంపిక చేసి పక్కాగా సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఇలా జిల్లాలో 2,368 మందికి రూ.16.40 కోట్ల సాయం అందించి ఆయా కుటుంబాలను ఆదుకున్నారు.

కూటమి వంచన

పేదింట వివాహాలకు ఉచిత సాయానికి మంగళం!

కల్యాణలక్ష్మి పేరుతో కొత్త పథకం

డ్వాక్రా మహిళలకు రూ.లక్ష రుణం

వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సిందే..

గత ప్రభుత్వంలో కల్యాణమస్తు, షాదీతోఫాతో ఆర్థిక చేయూత

జిల్లాలో 2,368 మందికి రూ.16.40 కోట్ల సాయం అందజేత

కూటమి ‘వ్యాపార’ పథకంపై పేదల పెదవి విరుపు

Advertisement
 
Advertisement
Advertisement