వీరవాసరం మండలంలో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పన్నులను కట్టకుండానే అధికారులను మచ్చిక చేసుకుని మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. 8లో u
దేశానికి విదేశీమారక ద్రవ్యం తెచ్చిపెడుతున్న ఆక్వా రంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూడడం దారుణం. ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఒక్కసారిగా ఫీడ్ ధరలు టన్నుకు రూ.16 వేలు పెంచేశారు. ఫీడ్ తయారీ ముడిసరుకు ధరలు తగ్గిన సమయంలో ఫీడ్ ధరలు తగ్గాల్సి ఉండగా మరింత పెంచారు. ప్రభుత్వం చర్యలు తీసుకుని వెంటనే పెంచిన ధరలు పూర్తిగా తగ్గించాలి.
– గాదిరాజు వెంకట సుబ్బరాజు (కేజీఎఫ్), వెస్ట్‌గోదావరి ప్రాన్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ కార్యదర్శి, భీమవరం
ఆక్వా ఫీడ్ ధరలు దారుణంగా పెంచారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా పెంచిన ధరలను పూర్తిగా తగ్గించాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, ధరల్లో నిలకడ లేకపోవడంతో ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం పూర్తిగా రైతులకు అండగా ఉండాల్సిన తరుణంలో ఫీడ్ ధరలు భారీగా పెంచడం దారుణం. పెంచిన ధరలను పూర్తిగా తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– భోగిరెడ్డి శ్రీనివాసరావు,
ఆక్వా రైతు, తోలేరు, వీరవాసరం మండలం


