ఈవీఎం గోడౌన్ల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఈవీఎం గోడౌన్ల తనిఖీ

May 13 2026 2:02 AM | Updated on May 13 2026 2:02 AM

వైభవంగా వెంకన్న కల్యాణోత్సవం ఈవీఎం గోడౌన్ల తనిఖీ

వైభవంగా వెంకన్న కల్యాణోత్సవం
పారిజాతగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కల్యాణోత్సవం మంగళవారం అత్యంతవైభవంగా నిర్వహించారు. 8లో u

భీమవరం (ప్రకాశంచౌక్‌): పీపీ రోడ్డులోగల ఏపీ స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోడౌన్లలో భద్రపరిచిన ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్‌ రూమ్‌లను కలెక్టర్‌ చదలవాడ నాగరాణి మంగళవారం తనిఖీ చేశారు. గోడౌన్లకు ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థ, సీసీ కెమెరాల పర్యవేక్షణను పరిశీలించారు.

రెవెన్యూ క్లినిక్‌లు సద్వినియోగం చేసుకోవాలి

భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి కోరారు. ఇప్పటివరకు మొత్తం 17 విడతలుగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 653 దరఖాస్తులు అందగా, 252 దరఖాస్తులను పరిష్కరించినట్లు చెప్పారు. 121 దరఖాస్తులను నిబంధనల ప్రకారం తిరస్కరించగా, ఇంకా 280 దరఖాస్తులు వివిధ దశలలో పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు.

స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానం

వెనుకబడిన వర్గాల విద్యా సాధికారత, సామాజిక– ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకంనకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ నాగరాణి తెలిపారు. అర్హత గల విద్యార్థులు జూన్‌ 2వ తేదీలోగా ఎన్‌ఓఎస్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement