వంతెన ఖానాలపై ఒత్తిడి | - | Sakshi
Sakshi News home page

వంతెన ఖానాలపై ఒత్తిడి

May 15 2026 10:56 AM | Updated on May 15 2026 10:56 AM

వంతెన ఖానాలపై ఒత్తిడి

నరసాపురం వయా కై కలూరు మీదుగా ఏలూరు చేరడానికి ప్రధాన మార్గంలో పెదయడ్లగాడి, చినయడ్లగాడి, పోల్‌రాజ్‌ డ్రెయిన్‌ వంతెన కీలకంగా ఉంటాయి. వీటిలో ప్రధానమైనది పెదయడ్లగాడి వంతెన కింద 56 ఖానాలు ఉన్నాయి. రాత్రి వేళల్లో వంతెనపై లైట్లు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పూర్వం వీటిలో కొన్ని ఖానాలకు మాత్రమే అడుగున పేరుకుపోయిన మట్టిని తొలగించారు. ఏటా గుర్రపుడెక్క పేరుకుపోవడంతో వంతెన ఒత్తిడికి గురవుతోంది. కొన్ని సందర్భాల్లో డెక్కను తొలగించడానికి వంతెనపై పొక్లయిన్లను వినియోగించడంతో వంతెన దెబ్బతింటోంది. రహదారి మరమ్మతుల విషయమై ఏలూరు ఆర్‌అండ్‌బీ డీఈఈ వై.వెంకట్‌కిషోర్‌ను వివరణ కోరగా వంతెన మరమ్మతుల కోసం నివేదిక అందించామన్నారు. విద్యుత్‌ దీపాలు స్థానిక పంచాయతీ సమకూర్చుకోవాలని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement