కూటమి ప్రభుత్వానిది అరాచక పాలన | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వానిది అరాచక పాలన

May 15 2026 10:56 AM | Updated on May 15 2026 10:56 AM

కూటమి ప్రభుత్వానిది అరాచక పాలన

భీమవరం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలుచేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్‌ ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా యువజన వి భాగం పట్టణ అధ్యక్షుడు బాలుపై అక్రమ కేసులు పెట్టి వేధించడాన్ని నిరసిస్తూ బుధవారం పట్టణంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో నిరసన తెలిపారు. కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమేగాక అవినీతి, అక్రమాలతో ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని సందీప్‌ ఆరోపించారు. వీటిపై ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అణచివేసేలా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఆచంట నియోజకవర్గ యు వజన విభాగం అధ్యక్షుడు గొట్టుముక్కల సునీల్‌వర్మ, స్టూడెంట్‌ వింగ్‌ తణుకు నియోజకవర్గ అధ్యక్షుడు గోపే ఎడ్వర్డ్‌పాల్‌, నరసాపురం టౌన్‌ యూత్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌, భీమవరం టౌన్‌ అధ్యక్షుడు గాదిరాజ రామరాజు, రాష్ట్ర ఆర్టీఐ విభాగ కార్యదర్శి గుంటి ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement