విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక గ్రీవెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక గ్రీవెన్స్‌

May 16 2026 11:01 PM | Updated on May 16 2026 11:01 PM

విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక గ్రీవెన్స్‌

భీమవరం (ప్రకాశంచౌక్‌): విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి.రామ్‌ కుమార్‌, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి ఎన్‌.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 22 అర్జీలు అందినట్లు డీఆర్వో పేర్కొన్నారు. పీజీఆర్‌ఎస్‌కు రావడానికి దివ్యాంగులు ఎదుర్కొనే ఇబ్బందులను దష్టిలో ఉంచుకుని సేవాభావంతో స్పందించి సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement