గోపాలరాజు సేవలు ఎనలేనివి | - | Sakshi
Sakshi News home page

గోపాలరాజు సేవలు ఎనలేనివి

May 12 2026 1:26 AM | Updated on May 12 2026 1:26 AM

గోపాలరాజు సేవలు ఎనలేనివి

భీమవరం (ప్రకాశంచౌక్‌): ప్రకృతి వైద్యుడు డాక్టర్‌ వేగిరాజు గోపాలరాజు సేవలు ఎనలేనివని శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేను రాజు అన్నారు. భీమవరం ప్రకృతి ఆశ్రమంలో సోమవారం డాక్టర్‌ వేగిరాజు గోపాలరాజు సంతాప సభ నిర్వహించారు. మోషేన్‌ రాజుతో పాటు డిప్యూటీ స్పీకర్‌ కనుమూరి రఘురామకృష్ణరాజు, రాష్ట్ర పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కలెక్టర్‌ చదలవాడ నాగరాణి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తాత, తల్లిందండ్రుల ఆశయాలు నిలబెడుతూ పేదలకు వైద్యం అందించిన ప్రకృతి వైద్యులు గోపాలరాజు అని అన్నారు. తానూ నమ్ముకున్న సిద్దాంతం కోసం గ్రామాన్ని వదలకుండా తాత, తండ్రి అందించిన ప్రకృతి ఆశ్రమంలోనే వైద్య సేవలు అందించిన గోపాలరాజు చిరస్మరణీయులన్నారు. కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి, వేగిరాజు రామకృష్ణంరాజు, వేగిరాజు శివవర్మ, మూర్తి తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement