పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై ఆగ్రహం

May 16 2026 11:01 PM | Updated on May 16 2026 11:01 PM

కోకో ధర పెంచాలి పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై ఆగ్రహం

కోకో ధర పెంచాలి
అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన కోకో గింజల ధరకు అనుగుణంగా రైతుల కోకో గింజలకు ధర పెంచాలని కోకో రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 8లో u

భీమవరం: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సరుకు రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరల ఆకాశాన్నంటాయని, పేద, మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారనుందని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ఆందోళన వ్యక్తం చేశారు. చమురు ధరల పెంపును నిరసిస్తూ శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో భీమవరం బుధవారం మార్కెట్‌ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా భీమారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు కొరవడిన కారణంగానే దేశానికి ఈ దుస్థితి పట్టిందన్నారు. చిరకాల మిత్రదేశంగా ఉన్న ఇరాన్‌ పట్ల భారత్‌ వైఖరి దేశానికి నష్టం కలిగిస్తుందన్నారు. మోదీ స్వార్ధపూరిత నిర్వాకం కారణంగా దేశ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం సీతారామ్‌ ప్రసాద్‌, కిలారి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement