విద్యుత్ సిబ్బంది అక్రమ వసూళ్లు
భీమవరం: ఆక్వా రంగాన్ని ఆదుకుంటాం.. జోన్స్ తో ప్రమేయం లేకుండా రొయ్యలు సాగుచేస్తున్న రైతులందరికీ సబ్సిడ్ విద్యుత్ అందిస్తాం.. అంటూ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు ఆక్వా రైతులను కన్నెత్తి చూడటం లేదు. ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినా పట్టించుకోవడం లేదు. సబ్సిడీ విద్యుత్ అందక సాగు భారమై రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో దాదాపు 1.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా సుమారు 90 వేల ఎకరాల్లో రొయ్యల సాగు ఉంది. నరసాపురం, భీమవరం, ఉండి, పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రొయ్యలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. అలాగే ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల పరిధిలోనూ వేలాది ఎకరాల్లో రొయ్యలను పండిస్తున్నారు.
గత ప్రభుత్వంలోనే విద్యుత్ సబ్సిడీ
జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 90 వేల ఎకరాలకు పైగా రొయ్యల సాగు ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆక్వా చెరువులను విద్యుత్ యూనిట్ రూ.1.50కే అందించారు. 2024 ఎన్నికల సమయంలో జోన్స్‌తో ప్రమేయం లేకుండా ఆక్వా రైతులందరికీ సబ్సిడీ విద్యుత్ అందిస్తామని కూటమి పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నష్టాల ఊబిలో ఉన్న తమకు సబ్సిడీ విద్యుత్ ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు ఆశించారు. అయితే చంద్రబాబు ప్రభు త్వం అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా రొ య్యల రైతులందరికీ సబ్సిడీ విద్యుత్ అందకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక పక్క విద్యుత్ కోతలు, గత నెలలో డీజిల్ కొరత వంటి సంక్షోభాలు రైతులను అతలాకుతలం చేశాయి. జిల్లాలో 16,332 ఆక్వా విద్యుత్ కనెక్షన్లు ఉండగా 14,242 కనెక్షన్లకు ప్రతినెలా సుమారు రూ.23 కోట్లు సబ్బిడీ కింద ఇస్తుండగా.. దాదాపు 2 వేల కనెక్షన్లకు సంబంధించి రాయితీ విద్యుత్ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. వీటిలో భీమవరం విద్యుత్ డివిజన్‌లో 1,235, నరసాపురం డివిజన్‌లో 585, తాడేపల్లిగూడెం డివిజన్‌లో 270 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. దీనిపై ఆక్వారైతు సంఘాలు ప లుమార్లు ప్రభుత్వం, విద్యుత్ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినా అదిగో, ఇదిగో ఇస్తున్నామంటూ కా లం వెళ్లదీస్తున్నారు.
సబ్బిడీ విద్యుత్ లభించని కొందరు రైతుల వద్ద విద్యుత్ శాఖ సిబ్బంది తక్కువ మీటర్ రీడింగ్‌లు తీయించి వారి వద్ద పెద్ద మొత్తంలో మామూళ్లు గుంజుతున్నట్టు తెలిసింది. ఇలా ఓ మండలంలోని విద్యుత్ లైన్‌మెన్ తప్పుడు విద్యుత్ రీడింగ్‌లతో పెద్ద మొత్తంలో కూడబెట్టగా అదికాస్తా బయట పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అతడిని భయపెట్టి కొందరు మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు సుమారు రూ.8 లక్షలు గుంజడంతో ఓ ప్రజాప్రతినిధి జోక్యం చే సుకుని తిరిగి ఇప్పించినట్టు ప్రచారం జరుగుతోంది. తప్పుడు రీడింగ్‌లతో ప్రభుత్వానికి న ష్టం చేకూర్చిన లైన్‌మెన్‌పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజాప్రతినిధి కొమ్ముకాయడంపై తీవ్ర చర్చ జరుతోంది. ప్రభుత్వం సబ్సిడీ వి ద్యుత్ ఇవ్వకపోవడం వల్ల రైతులు నష్టపోతుండగా కొందరు విద్యుత్ శాఖ సిబ్బంది పెద్ద మొ త్తంలో కూడబెట్టుకుంటున్నారని ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు సబ్సిడీ విద్యుత్‌ను ఆక్వా జోన్స్‌తో ప్రమేయం లేకుండా రైతులందరికీ ఇవ్వాలని కోరుతున్నారు.
విద్యుత్ రాయితీ.. అందేది అంతంతే !
జోన్స్‌తో ప్రమేయం లేకుండా సబ్సిడీ ఇస్తామని కూటమి నాయకుల హామీ
జిల్లాలో 90 వేల ఎకరాల్లో రొయ్యల సాగు
సబ్సిడీ వర్తించని కనెక్షన్లు 2,090
పట్టించుకోని ప్రజాప్రతినిధులు


