తణుకు అర్బన్: వేసవి దృష్ట్యా మున్సిపాలిటీల్లో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పురపరిపాలనా శాఖ ప్రాంతీ య సంచాలకుడు (ఆర్‌డీ) సీహెచ్ నాగనరసింహారావు సూచించారు. శుక్రవారం తణుకు మున్సిపల్ కార్యాలయంలో జిల్లాలోని మున్సి పల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఆస్తి పన్నుల వసూళ్లు, స్వచ్ఛ సర్వేక్షణ్ అమలు తీరు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, డ్రెయినేజీల పూడికతీత, వేసవిలో నీటి ఎద్దడి నివారణ చ ర్యలు, వీధి కుక్కల నియంత్రణలో భాగంగా ఆ పరేషన్లు చేపట్టే అంశాలపై సూచనలు చేశారు. ముందుగా పట్టణంలోని కంపోస్టు యార్డు, వీధి కుక్కల స్టెరిలైజేషన్ సెంటర్, పారిశుద్ధ్య నిర్వహణ, బాక్సు క్రికెట్ గ్రౌండ్‌ను పరిశీలించా రు. మున్సిపల్ కమిషనర్లు టి.రామ్‌కుమార్, కె. రామచంద్రారెడ్డి, ఎం.యేసుబాబు, ఆర్.వెంకటరామిరెడ్డి, బి.విజయసారథి, కృష్ణమోహన్, తణుకు మున్సిపల్ డీఈ కొవ్వూరి ఈశ్వరరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: విద్య, పరిశోధనల్లో విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి డిజి టల్ లైబ్రరీ దోహదపడుతుందని తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు అన్నారు. ఏపీ నిట్‌లో గ్రంథాలయ చైర్మన్ కార్తికేయ శర్మ ఆధ్వర్యంలో ప్రాంగణంలోని బీఆర్ అంబేడ్కర్ సెంట్రల్ లై బ్రరీలో ఎక్కడైనా కూర్చుని డిజిటల్ కంటెంట్‌ను పొందేలా ల్యాప్‌టాప్‌లతో కూడిన అధు నాతన డిజిటల్ లైబ్రరీని, రెండు డిస్కషన్ రూమ్‌లను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రమణరావు మాట్లాడుతూ వేలాది పుస్తకాలు, పరిశోధనా పత్రాలు, ప్రశ్న పత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రిజిస్ట్రార్ పి.దినేష్ శంకరరెడ్డి, డీన్‌లు రవికిరణ్, సందీప్, ఎన్.జయరామ్, వీరేష్‌కుమార్, హిమబిందు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
పెనుగొండ: కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అరెస్ట్ అయిన ఆచంట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు సుంకర సీతారామ్, కోటే శశి మధులకు పాలకొల్లు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొడమంచిలి పంచాయతీ పరిఽధిలో ఉపాధి హామీ పథకంలో అక్రమ చెల్లింపులకు పాల్పడ్డారంటూ అప్పటి ఫీల్డ్ అసిస్టెంట్, వైఎస్సార్ సీపీ యువజన విభాగం మండల కన్వీనర్ కోటే శశి మధు, మాజీ సర్పంచ్ సుంకర సీతారామ్‌ను ఎంపీడీఓ బి.కృష్ణమోహన్ ఫిర్యాదు మేరకు బు ధవారం అరెస్ట్ చేసి కోర్టుకు హజరు పరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. కూటమి నాయకుల ఇసుక, మట్టి అక్రమ త వ్వకాలకు అడ్డు తగులుతుండటంతో అక్రమ అరెస్ట్‌కు పాల్పడ్డారంటూ వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించి తీవ్ర నిరశన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో వైఎస్సార్‌సీపీ నాయకుల తరఫున మంగెన శ్రీనివాస మెహర్‌బాబా పాలకొ ల్లు కోర్టులో బెయిల్ కోసం వాదించగా, జూనియర్ సివిల్ జడ్జి, జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజి స్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. శుక్రవారం సాయంత్రం బెయిల్ మంజూరు కావడంతో, శనివారం ఉదయం సుంకర సీతారామ్, కోటే శశి మధు విడుదల కానున్నారు.
భీమవరం: టెన్త్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న తరుణంలో వారికి మధ్యాహ్న భోజనం అందజేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. జిల్లా కార్యదర్శి టి.ప్రసాద్ శుక్రవారం డీఈఓ ఈ.నారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్రసాద్ మాట్లా డుతూ ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష రాయడానికి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అభినందనీయమని, అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే తరగతుల్లో భోజనం లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీరికి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం కొనసాగించాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, భీమవరం పట్టణ అధ్యక్షుడు సాయికృష్ణ ఉన్నారు.


