న్యూస్‌రీల్
రెడ్‌బుక్ రాజ్యాంగం
చెరువుల జాతరకు అడ్డకట్ట పడదా...?
ముదినేపల్లి మండలంలో చేపల చెరువుల జాతరకు అడ్డకట్ట పడటం లేదు. తవ్వకాలకు అనుమతులు ఉన్నాయంటూ ఎకరాలకు ఎకరాలు తవ్వేస్తున్నారు. 8లో u
మంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2026
సాక్షి, భీమవరం: ఆచంటలో కూటమి బరితెగింపు పరాకాష్టకు చేరింది. ఇసుక, మట్టి దోపిడీపై ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసిన ఎనిమిది మంది వైఎస్సార్‌సీపీ నేతల్లో దళిత మాజీ సర్పంచ్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. మిగిలిన వారిపైనా కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రెడ్ బుక్ ఓపెన్‌న్ (8–1 = 7) జస్ట్ వెయిట్ అంటూ కూటమి నేతలు సోషల్ మీడియాలో పోస్టు చేయడం కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లాలో తీరప్రాంతానికి చేరువగా ఉన్న ఆచంట, పెనుగొండ, యలమంచిలి, నరసాపురం మండలాలను కోస్టల్ రెగ్యులేటరీ జోన్‌న్‌గా రెండేళ్ల క్రితం కేంద్రం ప్రకటించింది.
ఈ ప్రాంతంలోని వశిష్ట గోదావరి తీరం వెంట సిద్దాంతం, కరుగోరుమిల్లి, కోడేరు, నడిపూడిలోని ఆరు ఓపెన్ రీచ్‌లు, నరసాపురంలోని ఐదు డిసిల్టేషన్ పాయింట్లు మూసివేశారు. ఇదే అదనుగా కూటమి నేతలు సీఆర్‌జెడ్ నిబంధనలు తుంగలో తొక్కి ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలకు తెరలేపారు. ఏటిగట్టు, లంక భూములు, నక్కల డ్రెయిన్‌లో కోట్లాది రూపాయల సహజ సంపదను కొల్లగొడుతున్నారు. అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ స్థానిక నాయకులు పోరాటం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేత, కొడమంచిలి మాజీ సర్పంచ్ సుంకర సీతారామ్ తదితరులు తవ్వకాలు జరుగుతున్న చోటకు వెళ్లి అడ్డుకుని అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
ఆచంట మండలంలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలుపై సీతారాంతో పాటు మరో ఏడుగురు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. తవ్వకాలకు వ్యతిరేకంగా న్యాయస్థానం నుంచి ఆదేశాలు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఉపాధి పనుల్లో అవకతవకల పేరిట ఫీల్డ్ అసిస్టెంట్‌తో పాటు ముందెన్నడూ లేని విధంగా మాజీ సర్పంచ్ సీతారాంను ఇటీవల అక్రమంగా అరెస్టు చేయించడం తెలిసిందే. న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు
కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఆటోడ్రైవర్‌పై ఎమ్మెల్యే వీరంగం, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, అరెస్టులతో వేధింపులకు గురిచేసిన ఘటనలెన్నో. ఇదే క్రమంలో ఆచంటలో అక్రమ తవ్వకాలకు అడ్డు తగులుతున్న సీతారామ్‌పై అక్రమ కేసు బనాయించారు. మిగిలిన ఏడుగురిని లక్ష్యంగా చేసుకుని కుట్రలు చేస్తున్నారు. రెడ్ బుక్ ఓపెన్ (8–1 = 7) జస్ట్ వెయిట్ అంటూ కూటమికి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో ఆ పార్టీలకు చెందిన వారు పోస్టులు పెట్టడం గమనార్హం. అధికారాన్ని అడ్డంపెట్టుకుని కూటమి నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్న చెప్పేందుకు ఈ పోస్టు నిదర్శనమని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల పక్షాన తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు. ఇసుక, మట్టి సహజ సంపదను కొల్లగొడుతూ పర్యావరణానికి, ముంపు రూపంలో రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలకు నష్టం కలిగిస్తుంటే ఉపేక్షించేది లేదంటున్నారు.
ఆచంటలో అక్రమ మైనింగ్‌పై వైఎస్సార్‌సీపీ పోరుబాట
సీఆర్‌జెడ్‌లో ఇసుక, మట్టి తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు
వారిలో దళిత మాజీ సర్పంచ్ అక్రమ అరెస్టు
రెడ్ బుక్ ఓపెన్ (8–1 =7) జస్ట్ వెయిట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు
అక్రమాలపై పోరాటం ఆపేది లేదన్న వైఎస్సార్‌సీపీ


