ఆన్‌లైన్‌ మందుల విక్రయాలతో నష్టం | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ మందుల విక్రయాలతో నష్టం

May 17 2026 7:26 AM | Updated on May 17 2026 7:26 AM

ఆన్‌లైన్‌ మందుల విక్రయాలతో నష్టం

పాలకొల్లు సెంట్రల్‌: ఆన్‌లైన్‌ మందుల విక్రయాలతో చిరు వ్యాపారులకు నష్టం వాటిల్లుతోందని, దీనికి నిరసనగా ఈనెల 20న దేశవ్యాప్త మెడికల్‌ షాపుల బంద్‌ పాటిస్తున్నట్టు జిల్లా కెమిస్ట్‌ అండ్‌ డ్రగిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తటవర్తి కృష్ణమూర్తి తెలిపారు. శనివారం పట్టణంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌ మందుల విక్రయాలపై ప్రభు త్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ ఇప్పటికీ కొనసాగించడం దారుణమన్నారు. అక్రమ ఈ–ఫార్మసీలు ప్రజారోగ్యానికి ముప్పని, భౌతిక ధ్రువీకరణ లేకుండా మందుల విక్రయాల వల్ల ఒకే ప్రిస్కిప్షన్‌ను పదేపదే ఉపయోగించే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఏఐ ఆధారిత నకిలీ ప్రిస్కిప్షన్లు, యాంటీ బయాటిక్స్‌ అలవాటు కలిగించేలా మందులపై నియంత్ర ణ లేకుంటే ప్రజారోగ్యానికి ముప్పు తప్పదన్నారు. ఈ–ఫార్మసీలు భారీ డిస్కౌంట్ల కారణంగా దేశంలో కెమిస్ట్‌, డ్రగ్గిస్ట్‌పై ఆధారపడిన సుమారు 5 కోట్ల కు టుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. ఆయా సమస్యలపై ప్రధానికి విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని, దీంతో దేశవ్యాప్తంగా ఒక్కరోజు బంద్‌కు పిలుపునిచ్చినట్టు చెప్పారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.చలపతి, ట్రెజరర్‌ జీవీఆర్‌ ఫణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement