ఆరుగాలం కష్టపడి పండించిన దాళ్వా పంట చేతికొచ్చింది. ఇప్పటికే 70 శాతం రైతులు మాసూళ్లు పూర్తి చేసి, ధాన్యం అమ్ముకోగా, మిగిలిన రైతులు వరికోతలు కోయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ దశలో వాతావరణ మార్పులు రైతుల గుండెల్లో గుబులు రేపుతుంది. గురువారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఒకల్కసారిగా వాతావరణం మబ్బులతో నిండి వర్షం జల్లులు పడటంతో రైతులు ఆగమేఘాలపై ఽరాశులు చేసిన ధాన్యం, రోడ్లు, పుంతగట్లపై ఎండబెట్టిన ధాన్యం, ఎగుమతి చేయడానికి నెట్టుకట్టిన బస్తాలు వర్షం పాలు కాకుండా సంరక్షించుకోవడానికి నానా తంటాలు పడ్డారు. – గణపవరం


